థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుండి మీ Facebook ఖాతాను డిస్కనెక్ట్ చేయడం ఎలా ?

థర్డ్ పార్టీ అప్లికేషన్లకు మీరిచ్చిన అనుమతుల గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

|

Cambridge Analytica harvested అనే పరిశోధక సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం 2016అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లకై అవసరమైన 50మిలియన్ల వినియోగదారుల వివరములు కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్లు సంగ్రహించాయని, తద్వారా ట్రంప్ గెలుపుకు మార్గం సుగమం అయిందని, కావున Facebookలో కనిపించే ఈ అప్లికేషన్ల వాడకం మంచిది కాదని తెలిపింది. కావున ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్లకు మీరిచ్చిన అనుమతుల గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మీరు అనుమతి ఇచ్చిన అప్లికేషన్స్ లోని వివరములు చేతులు మారే అవకాశం లేకపోలేదు. ఈ అప్లికేషన్స్ అనేక ఇతరములైన, మీ అనుమతి తీసుకోని ఆర్గనైజేషన్స్ కి మీ వివరములను చేరవేసే అవకాశం ఉంది. కావున అవసరంలేని ఆ అప్లికేషన్స్ అనుమతిని తొలగించుట శ్రేయస్కరం అని నిపుణుల సలహా. Cambridge Analytica ఈ డేటాని thisisyourdigitallife అనే ఒక ప్రొఫైల్ నుండి సంగ్రహించింది. ఈ ప్రొఫైల్ ఏమాత్రం ఆలోచన అవసరం లేకుండా అనుమతిని ఇచ్చేలా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని కారణంగా ఎంతోమంది తమ వ్యక్తిగత వివరాలను తమకు తెలీకుండానే ఈ అప్లికేషన్ బారిన పడేలా చేసుకున్నారు. కావున ఇలాంటి అప్లికేషన్లు తొలగించే పద్దతిని ఇక్కడ పొందుపరచడం జరిగినది.

ఫేస్‌బుక్ అధినేతకి ఇండియా సీరియస్ వార్నింగ్, టచ్ చేసి చూడు..ఫేస్‌బుక్ అధినేతకి ఇండియా సీరియస్ వార్నింగ్, టచ్ చేసి చూడు..

మీరసలు ఏవివరాలను భాగస్వామ్యం చేస్తున్నారు?

మీరసలు ఏవివరాలను భాగస్వామ్యం చేస్తున్నారు?

ఏదైనా ఒక ఆన్లైన్ సర్వీసుని వినియోగించాలి అనుకున్నప్పుడు, ఈ మద్యన ఎక్కువగా గూగుల్, ఫెస్బుక్, లింక్డ్ ఇన్ వంటి సర్వీసులతో లాగిన్ అయ్యేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. తద్వారా వినియోగదారులకు పెద్దగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే లాగిన్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం కల్పించబడినది. కానీ కొన్ని ఆన్లైన్ సర్వీసులు ఈ పద్దతిని చెడు కార్యకలాపాలకు కూడా వినియోగించుకుంటున్నాయి అని నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. అనగా వ్యక్తిగత వివరాలు తీసుకుని కొన్ని సంస్థలకు అందజేయడం వంటివి. వీటి కారణంగానే అనేక స్పామ్ కాల్స్ కూడా పుట్టుకుని వచ్చాయి అన్నది జగమెరిగిన సత్యం. ఈ అప్లికేషన్స్ సేకరించే వివరాలు ముఖ్యంగా పూర్తి పేరు, స్నేహితుల జాబితా, ప్రొఫైల్ చిత్రం, ఫోటోలు, చదువు, పని.

 

 

ఫేస్బుక్ లోనే అనేక అప్లికేషన్స్

ఫేస్బుక్ లోనే అనేక అప్లికేషన్స్

అదేవిధంగా ఫేస్బుక్ లోనే అనేక అప్లికేషన్స్ మీరు ఏ హీరోలా ఉన్నారో తెలుసుకోండి? మీ జాతకం ప్రకారం ఎంత కాలం బ్రతుకుతారు? వంటి అర్ధం పర్ధం లేని ప్రశ్నలు కలిగి ఉన్న అనేక అనువర్తనాలు, మీ వివరాలను ఇవ్వవలసినదిగా అభ్యర్ధిస్తూ ఉంటాయి. వీటికి ఆకర్షితులైన వారు క్లిక్ చేసి, తమకు తెలీకుండానే తమ వివరాలను ఇస్తున్నారు. మన వివరాలు తీసుకుని వీరేం చేస్తారులే అన్న భావనే అనేక ప్రమాదాలకు సగం కారణం.

అనువర్తనాలను డిస్కనెక్ట్ చేయడం ఎలా:

అనువర్తనాలను డిస్కనెక్ట్ చేయడం ఎలా:

మీరు ఏ అప్లికేషన్స్ కి అనుమతిని ఇచ్చారో తెలుసుకోవడానికి ముందుగా, ఫేస్బుక్ సెట్టింగ్స్ పేజీని తనిఖీ చేయండి. ఇక్కడ మీరు ఏ అప్లికేషన్స్ కి అనుమతిని ఇచ్చారో కనిపిస్తాయి, వీటిలో మీకు బాగా తెలిసిన మంచి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. మీఅవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తెలియని, నమ్మకంలేని అప్లికేషన్స్ ని తొలగించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు తొలగించాలనుకున్న అప్లికేషన్ పై క్లిక్ చేశాక కూడా, డెవెలపర్ మీనుండి తీసుకున్న వివరాలు, గోప్యతా విధానాలు కూడా కొన్ని అప్లికేషన్స్ లో కనిపిస్తుంటాయి. కానీ డెవెలపర్స్ కి ఇది ఖచ్చితం కాదు. మీ వాల్ పై పోస్టు చెయ్యడానికి ఒకవేళ మీరు అనుమతిని ఇచ్చి ఉన్నట్లయితే, వాటిని తొలగించడం మంచిది. ఒక్కోసారి మీరు అప్లికేషన్ ను తొలగించినా కూడా డెవెలపర్ మీ వివరాలను కలిగి ఉండవచ్చు. కావున ఫేస్బుక్ డెవలపర్ని కాంటాక్ట్ అవమని సూచిస్తుంది.

 

 

భవిష్యత్తులో తక్కువ డేటాను భాగస్వామ్యం చేయండి:

భవిష్యత్తులో తక్కువ డేటాను భాగస్వామ్యం చేయండి:

మీరు ఏవైనా మూడవ పార్టీలతో మీ ఫేస్బుక్ సమాచారాన్ని భాగస్వామ్యం చేయకూడదనుకుంటే 'Apps, వెబ్సైట్లు మరియు ప్లగిన్లు'లో' edit ఆప్షన్ ఎంచుకోండి తద్వారా ఫేస్బుక్ ప్లాట్ఫాం నుండి మీ ఖాతాను డిస్కనెక్ట్ చేయండి. మీరు మీ స్వంత భాగస్వామ్య ప్రాధాన్యతలను గురించి చింతించవలసిన అవసరం లేదు - కానీ ఒక్కోసారి మీ స్నేహితులు ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే, మీ డేటా కూడా సంగ్రహించబడే అవకాశం ఉంది. ఫేస్బుక్ ప్రకారం, ఇది "వారి అనుభవాన్ని మెరుగ్గా మరియు మరింత సామాజికంగా చేస్తుంది", కానీ వారు ఏ అనువర్తనాలను నమ్ముతారు అనే అంశం పైనే మీ ప్రైవసీ ఆధారపడి ఉంటుంది, కావున వీటిని ఆఫ్ చేయడమే మంచిది. దీనిని నివారించడానికి, మీ App సెటింగ్స్ సందర్శించండి, Apps other people use శీర్షికలో 'EDIT' ఎంచుకోండి మరియు మీరు ప్రైవేట్ గా ఉంచే అన్ని వర్గాల ఎంపికలను తీసివేయండి.

సైట్లోకి లాగిన్ అయ్యి ..

సైట్లోకి లాగిన్ అయ్యి ..

చివరగా, మీరు ఫేస్బుక్ ఉపయోగించి సైట్లోకి లాగిన్ అయ్యి లేదా కొత్త అనువర్తనాన్ని అనుసంధానించినప్పుడు, అది ఏ సమాచారాన్ని అభ్యర్థిస్తుందో తనిఖీ చేయండి మరియు ఇది నిజంగా శ్రేష్ఠమైనది కాదో పరిశీలించండి. Cambridge Analytica నివేదిక ప్రకారం, అనేక ఇతరములైన సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది.

Best Mobiles in India

English summary
How to disconnect your Facebook account from third-party apps More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X