వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

|

వాట్సాప్‌లో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ మొత్తానికి ఇప్పుడు ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ యొక్క స్థానిక డార్క్ మోడ్‌ను థీమ్ సెలక్షన్ ఇంటర్‌ఫేస్‌లో డార్క్ అని పిలుస్తారు. ఇది మెసేజింగ్ యాప్ యొక్క మొత్తం UI ప్రొఫైల్‌కు కొన్ని విభిన్న రంగులను అందిస్తుంది.

డార్క్ మోడ్ ఫీచర్

డార్క్ మోడ్ ఫీచర్

వాట్సాప్‌లోని డార్క్ మోడ్ ఫీచర్ ఇప్పటికే గూగుల్ ప్లే ద్వారా బీటా టెస్టర్‌ల కోసం ప్రారంభమైంది. ఇది కొత్త v2.20.13 అప్‌డేట్‌తో వస్తుంది.మీరు ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ అయితే ఇంకా అప్‌డేట్ పొందివుండకపోతే గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ మరియు APK మిర్రర్ నుండి వాట్సాప్ బీటా v2.20.13 APK ని సైడ్‌లోడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు బీటా టెస్టర్ కాకపోతే యాప్ యొక్క కొత్త డార్క్ మోడ్‌ను ప్రయత్నించడానికి వేచి ఉండకపోతే గూగుల్ ప్లే ద్వారా బీటా టెస్టర్‌గా మారడానికి మీరు వాట్సాప్ బీటా బిల్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో దొంగ ఓట్లకు చెక్ ! తెలంగాణ ఎన్నికల్లో వాడకంఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో దొంగ ఓట్లకు చెక్ ! తెలంగాణ ఎన్నికల్లో వాడకం

అప్‌డేట్

అప్‌డేట్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు మొదట వాట్సాప్ డార్క్ మోడ్‌ను చూడకపోతే వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ను తొలగించి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని WABetaInfo తెలిపింది. వాస్తవానికి మీ చాట్ చరిత్రను బ్యాకప్ చేసిన తర్వాత మాత్రమే యాప్ ను డెలీట్ చేయండి.

 

 

రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు..... ఆఫర్స్ అదుర్స్రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు..... ఆఫర్స్ అదుర్స్

గమనిక

గమనిక

డార్క్ మోడ్ ఫీచర్ ఎలా యాక్టివేట్ అవుతుందనే దాని గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి. ఇందులో ముఖ్యమైన విషయం ఈ డార్క్ మోడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి. ఫీచర్ స్థిరమైన ఛానెల్ ద్వారా ఎప్పుడు విడుదల చేయబడుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

 

 

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ఎలా ప్రారంభించాలి?

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ఎలా ప్రారంభించాలి?

వాట్సాప్‌లో డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్‌ను ప్రారంభించడం చాలా సులభం. క్రొత్త రూపాన్ని త్వరగా యాక్టీవేట్ చేయడానికి క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి. లైట్ తక్కువగా ఉన్న వాతావరణంలో కళ్ళపై తేలికగా ఉండటమే కాకుండా OLED స్క్రీన్ ఫోన్‌లలో బ్యాటరీని ఆదా చేయడంలో కూడా ఇది మీకు సహాయపడుతుంది.

 

 

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్

step1

1. వాట్సాప్ యొక్క తాజా బీటా అప్‌డేట్ ను డౌన్‌లోడ్ చేసి తరువాత యాప్ ను ఓపెన్ చేయండి.

step2

2. మీరు యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ యొక్క కుడివైపున ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెను చిహ్నంపై నొక్కండి. తరువాత మెనులోని "సెట్టింగులు" అనే ఆప్షన్ ను ఎంచుకోండి.

step3

3. తరువాత సెట్టింగ్స్ పేజీలోని "చాట్‌" అనే ఆప్షన్ ను ఎన్నుకోండి. ఆపై "థీమ్‌" ఆప్షన్ మీద నొక్కండి. అలా చేయడం వలన మీరు థీమ్‌ను ఎంచుకునే విండో ఓపెన్ అవుతుంది.

step4

4. విండో పేజీ ఓపెన్ అయిన తరువాత అందులోని "డార్క్" అనే ఆప్షన్ మీద నొక్కండి. ఇది యాప్ లో డార్క్ మోడ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభిస్తుంది.

5. సిస్టమ్ సెట్టింగుల ఆధారంగా డార్క్ మరియు లైట్ మోడ్ మధ్య ఆటోమ్యాటిక్ గా మారడానికి మీరు సిస్టమ్ డిఫాల్ట్ ఎంపికను ఎంచుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Enable the Dark Mode Theme in WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X