మీరు వాట్సప్‌లో బ్లాక్ చేయబడ్డారని తెలుసుకోవటం ఎలా..?

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ అనేక సౌకర్యాలను మనకు చేరువ చేస్తోంది. వాట్సాప్‌లో మనకు నచ్చని కాంటాక్ట్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ చేసుకునే వెసలుబాటు ఉంది.

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ అనేక సౌకర్యాలను మనకు చేరువ చేస్తోంది. వాట్సాప్‌లో మనకు నచ్చని కాంటాక్ట్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ చేసుకునే వెసలుబాటు ఉంది. ఇలా చేసినపుడు మనం బ్లాక్ చేసిన సంగతి కూడా అవతలి వ్యక్తికి తెలియదు. ఒకవేళ మిమ్మల్ని కూడా వాట్సాప్‌లో ఏవరైనా బ్లాక్ చేసి ఉంటారని సందేహ పడుతున్నట్లయితే ఈ క్రింది మార్గాలను ఫాలో అయి ఎవరెవరు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో ఉంచారో తెలుుకోండి..

వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండివాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండి

లాస్ట్ సీన్ కాంటాక్ట్ స్టేటస్ కోసం చూడండి..

లాస్ట్ సీన్ కాంటాక్ట్ స్టేటస్ కోసం చూడండి..

మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడ్డారని కన్ఫర్మ్ చేయటానికి ఇదొక సంకేతం. ముందుగా మీ వాట్సాప్ అకౌంట్‌లోని అన్ని కాంటాక్ట్‌లకు సంబంధించి లాస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి. వాటిలో ఏదైనా ఛేంజ్ అయి ఉన్నట్లయితే దానిని అనుమాస్పదంగా భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో చాట్ విండోలికి వెళ్లి ఆన్‌లైన్ స్టేటస్‌లను కూడా పరిశీలిన చేయండి. ఎక్కడైనా సెట్టింగ్స్ ఛేంజ్ చేసి ఉన్నట్లయితే మిమ్మల్ని బ్లాక్ లిస్టులో ఉంచినట్లు నిర్థారణ చేసుకోవచ్చు.

కాంటాక్ట్స్ ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్స్ కోసం చూడండి...

కాంటాక్ట్స్ ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్స్ కోసం చూడండి...

మిమ్మల్ని వాట్సాప్‌లో ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే వారి కాంటాక్ట్ ప్రొఫైల్ ఫోటోకు సంబంధించిన అప్‌డేట్స్ పూర్తిగా నిలిచిపోతాయి. కాబట్టి ఈ మార్గం ద్వారా కూడా ఎవరెవరు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో ఉంచారో తెలుుకోవచ్చు.

కాంటాక్ట్‌కు మెసేజ్ చేయటం ద్వారా..

కాంటాక్ట్‌కు మెసేజ్ చేయటం ద్వారా..

మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడ్డారని కన్ఫర్మ్ చేయటానికి ఇదొక సంకేతం. మీరు అవతలి వ్యక్తికి మెసేజ్ చేసినపుడు కేవలం ఒక్క టిక్ మార్క్ మాత్రమే చూపుతున్నట్లయితే ఆ మెసేజ్ డెలివరీ కాలేదని అర్థం. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ స్టేటస్ అలానే ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే.

కాంటాక్ట్‌కు కాల్ చేయటం ద్వారా..

కాంటాక్ట్‌కు కాల్ చేయటం ద్వారా..

వాట్సాప్‌లో మీరో వ్యక్తికి కాల్ చేసేందుకు ప్రయత్నించినపుడు ఆ కాల్ ఎంతసేపటికి కలవనట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్లే.

ఆ కాంటాక్ట్‌తో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయటం ద్వారా..

ఆ కాంటాక్ట్‌తో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయటం ద్వారా..

పైన పేర్కొన్న మార్గాలు అమలుపరచినప్పటికి సరైన ఫలితం మీకు లభించనట్లయితే చివరి మార్గంగా ఈ ట్రిక్‌ను అప్లై చేయండి. ముందుగా మీ వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయండి. గ్రూప్ క్రియేట్ అయిన తరువాత ఓ పర్టికులర్ కాంటాక్ట్‌కు సంబంధించి "you are not authorized to add this contact," అనే మెసేజ్ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ కాంటాక్ట్ మిమ్మల్ని బ్లాక్ లిస్టులో ఉంచినట్లే.

Best Mobiles in India

English summary
This shouldn't come as a surprise, but among all the features that instant messaging app WhatsApp has to offer, one of them is blocking a contact you no longer wish to talk to.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X