ఒకే వాట్సాప్ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా..?
వాట్సాప్ యాప్ ను (Whatsapp Linked Devices) భారత్‌లో సుమారు 50 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల సౌకర్యం కోసం వాట్సాప్ అనేక కొత్త ఫీచర్ లను విడుదల చేస్తోంది. ఇందులో యూజర్ల సౌకర్యం కోసం ప్రస్తుతం వివిధ ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం వాట్సాప్ అకౌంట్ ను నాలుగు డివైజ్‌లతో లింక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వాట్సాప్ ను యాడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతోంది. వాట్సాప్ వెబ్‌లో మన అకౌంట్‌ను లింక్ చేయడం చాలా సులభం. క్యూఆర్ కోడ్ లేదా OTP ద్వారా లాగిన్ అవుతున్నాం. అయితే రెండు స్మార్ట్ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను వినియోగించడంపై చాలా మందికి అవగాహన లేదు.

ఒకే వాట్సాప్ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించేందుకు రెండు హ్యాండ్‌సెట్‌ను ఒకే దగ్గర ఉండాలి. అయితే లింక్ చేసిన డివైజ్ నుంచి మెసేజ్‌లు పంపించవచ్చు. కానీ కాల్స్ మాట్లాడే అవకాశం లేదని తెలుస్తోంది. కాల్స్‌ను ప్రైమరీ డివైజ్‌కు మాత్రమే అనుమతి ఉంది.
రెండు ఫోన్‌లలో ఒకే వాట్సాప్‌ను ఎలా ఉపయోగించాలి :
వాట్సాప్ వెబ్‌కి కనెక్ట్ చేసినప్పుడు వినియోగించిన క్యూఆర్ కోడ్ విధానం ద్వారానే.. రెండు స్మార్ట్ఫోన్లలో ఒకే వాట్సాప్‌ను లాగిన్ చేయవచ్చు. ఇందుకోసం రెండో ఫోన్ లో వాట్సాప్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రెండో ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన అనంతరం లాగిన్ కావాలి. లాగిన్ సమయంలో ఫోన్ నంబర్ స్థానంలో ప్రైమరీ అకౌంట్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అక్కడ కనిపించిన త్రీడాట్స్ మెనూ వద్ద కంపేనియన్ డివైజ్ (Companion Device) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు అక్కడ మీకో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
వెంటనే వాట్సాప్ ప్రైమరీ అకౌంట్‌ను ఓపెన్ చేసి, లింక్ డివైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ కానుంది. ఈ స్కానర్ ద్వారా రెండో డివైజ్ వాట్సాప్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లింక్ చేయాలి. ఈ విధానం ద్వారా రెండు ఫోన్‌లలో ఒకే వాట్సాప్ ను వినియోగించుకోవచ్చు.
* దీంతోపాటు థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ నుంచే డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టెస్టింగ్ జరుగుతోంది. తొలుత iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటికి ఈ ఫీచర్ విడుదల కానుందో వెల్లడి కాలేదు.
* ఇటీవల వాట్సాప్‌నకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న వాట్సాప్ పేమెంట్స్‌పైన ఉన్న ఆంక్షలును తొలగిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ప్రస్తుతం కేవలం 10 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. తాజా నిర్ణయంతో 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులకు ఈ యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








