వాట్సప్ కొత్త ఫీచర్, ఇక కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్లతో కూడా చాట్ చేసుకోవచ్చు!

|

వాట్సాప్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో తమ వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు రోజుకో కొత్త ఫీచర్‌తో వాట్సాప్ ముందుకస్తోంది. తాజాగా ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి 'Click to Chat' పేరుతో కొత్త ఫీచర్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ అడ్రస్ బుక్‌లో సేవ్ కాని నెంబర్లతో చాట్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా అవతలి వ్యక్తితో చాట్ చేసుకునేందుకు అవసరమైన ఒక సపరేట్ లింక్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 5551234567 అనే గుర్తు తెలియని (మీ ఫోన్ అడ్రస్ బుక్‌‌లో సేవ్ కాని) నెంబర్‌తో చాట్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ విధంగా https://api.whatsapp.com/send?phone=15551234567 లింక్‌ను క్రియేట్ చేసుకుని ఆ వ్యక్తితో చాటింగ్ నిర్వహించుకునే వీలుటుంది.

 
వాట్సప్ కొత్త ఫీచర్,కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్లతో చాట్ చేసుకోవచ్చు

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వాట్సాప్ వెబ్‌లోనూ వర్క్ అవుతుంది..
ఇంటర్నెషనల్ ఫార్మాట్‌లో (సున్నాలు, బ్రాకిట్లు ఎలిమినేట్ చేసి) మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. అంటే ఐఎస్‌డి కోడ్ 001 అయితే, ముందు రెండు సున్నాలు తీసేసి మొబైల్ నెంబర్‌కు ముందుకు ఒకటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ 'Click to Chat' ఫీచర్ అనేది స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వాట్సాప్ వెబ్‌లోనూ వర్క్ అవుతుంది. కేవలం వ్యక్తిగత చాట్ లను మాత్రమే ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. గ్రూప్ చాట్ లను సపోర్ట్ చేయదు.

నెలకి 1000జిబి డేటా,35 పైసలకే 1జిబి డేటా, జియోకి అసలైన సవాల్నెలకి 1000జిబి డేటా,35 పైసలకే 1జిబి డేటా, జియోకి అసలైన సవాల్

వాట్సాప్ గ్రూప్స్ కోసం కీలక అప్‌డేట్స్..
తాజాగా వాట్సాప్ గ్రూప్‌లను ఉద్దేశించి పలు కీలక అప్‌డేట్‌లను వాట్సాప్ అనౌన్స్ చేయటం జరిగింది. తాజా అప్‌డేట్స్‌లో భాగంగా గ్రూప్ డిస్క్రిప్షన్, అడ్మిన్ కంట్రోల్స్, గ్రూప్ క్యాచప్, పార్టిసిపెంట్ సెర్చ్, అడ్మిన్ పర్మిషన్స్ వంటి విభాగాలను వాట్సాప్ అప్‌డేట్ చేసింది.

గ్రూప్స్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించవచ్చు...
తాజా ఇంప్రూవ్‌మెంట్స్ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లు తమ గ్రూప్స్ నుంచి శాస్వుతంగా నిష్క్రమించవచ్చు. ఇదే సమయంలో గ్రూప్ కన్వర్జేషన్‌లోని తమ మేసేజ్‌లను వేగంగా లొకేట్ చేసుకునే వీలుంటుంది. మరో ఫీచర్ "Restrict Group" ద్వారా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ తమ గ్రూపులోని వ్యక్తులను రిస్ట్రిక్ట్ చేసుకునే వీలుంటుంది. అంటే, గ్రూప్ అడ్మిన్స్ పంపే మెసేజ్‌లను సభ్యులు చూడగలుగుతారుగాని రిప్లై ఇవ్వలేరు.

Best Mobiles in India

English summary
WhatsApp comes with a 'Click to Chat' feature that allows users to begin a chat with someone without having their phone number saved in your phone's address book.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X