గూగుల్ డ్రైవ్ ఫైల్స్‌ను ఇంటర్నెట్‌తో పనిలేకుండా వినియోగించుకోవటం ఎలా..?

|

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ ఆన్‌లైన్ సర్వీసుల్లో Google Drive స్టోరేజ్ ఒకటి. ఈ క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ సర్వీస్ ద్వారా గూగుల్ యూజర్లు తమ ఆన్‌లైన్ కంటెంట్‌ను క్లౌడ్ స్టోరేజ్ సిస్టంలో భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్‌లో భద్రపరచబడిన ఫైల్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

 

ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ యాక్సిస్ చేసుకునే అవకాశం..

ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ యాక్సిస్ చేసుకునే అవకాశం..

నిన్న మొన్నటి వరకు గూగుల్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను యాక్సిస్ చేసుకోవాలంటే మొబైల్ ఇంటర్నెట్ లేేదా వై-ఫై నెట్‌వర్క్ అవసరమయ్యేది. అయితే, తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన అప్‌డేట్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ డ్రైవ్ ఫైల్స్‌ను యాక్సిస్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఇంటర్నెట్‌తో పనిలేకుండా గూగుల్ డ్రైవ్ ఫైల్స్‌ను ఏ విధంగా వినిగించుకోవచ్చు అనే దాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను మీ ముందు ఉంచుతున్నాం..

 Google Docs offline అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌..

Google Docs offline అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌..

మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే ముందుగా మీ డివైస్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తరువాత నార్మల్ విండోలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. ఇక్కడ incognito మోడ్‌ను ఉపయోగించవద్దు. తదుపరి స్టెప్‌లో భాగంగా Google Docs offline అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత ఫైల్స్ సేవ్ అయ్యేందుకు కావల్సిన స్పేస్‌ను మీ డివైస్‌లలో క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది.

గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్‌లైన్‌లో ఓపెన్ అవ్వాలంటే..?
 

గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్‌లైన్‌లో ఓపెన్ అవ్వాలంటే..?

ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్‌లోకి సైన్-ఇన్ అవ్వండి. సైన్-ఇన్ అయిన తరువాత drive.google.com/drive/settingsలోకి వెళ్లాలి. డ్రైవ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత మీరు ఆఫ్‌లైన్‌లో ఎడిట్ చేయాలనుకుంటోన్న గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ & డ్రాయింగ్ ఫైల్స్‌ను సెలక్ట్ చేసుకుని సింక్ చేయవల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్ మోడ్‌..

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్ మోడ్‌..

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే ముందుగా గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేసి మీరు ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటోన్న ఫైల్ పై క్లిక్ చేయాలి. ఫైల్ ఓపెన్ అయిన తరువాత యాప్ మెయిన్ స్ర్కీన్ పై కనిపించే మూడు డాట్ల ఐకాన్ పై క్లిక్ చేసి ఆ ఫైల్‌ను సేవ్ చేస్తే సరిపోతుంది.

Best Mobiles in India

English summary
How to use Google Drive files offline on your computer and Android.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X