వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, గ్రూప్ కాలింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ డివైస్‌లను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తోంది.

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, గ్రూప్ కాలింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ డివైస్‌లను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తోంది. ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఒకే వాట్సాప్ కాల్‌లో మల్టిపుల్ యూజర్లతో ఒకేసారి మాట్లాడుకునే వీలుంటుంది. వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుని ఆడియో అలానే వీడియో కాల్స్ ఏ విధంగా నిర్వహించుకోవచ్చు అనే దాని పై స్టెప్ బై స్టెప్ గైడ్‌ను మీకందించటం జరుగుతోంది..

 

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే..

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే..

ముందుగా మీమీ స్మార్ట్‌ఫోన్‌లలోని వాట్సాప్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌‌ను ఆస్వాదించే క్రమంలో మీ ఫోన్ తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

 

 

గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే..?

గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే..?

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ ద్వారా గ్రూప్ వాయిస్ కాల్స్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత ఒక పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకుని టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే వాయిస్ కాల్ బటన్ పై క్లిక్ చేయండి. కాల్ కనెక్ట్ అయిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే యాడ్ పార్టిసిపెంట్ బటన్ పై క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇదే విధమైన ప్రొసీజర్‌ను ఫాలో అవుతూ మరింత మంది పార్టిసిపెంట్స్‌ను మీ గ్రూప్ వాయిస్ కాల్‌లో యాడ్ చేసుకోవచ్చు.

గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవాలంటే..?
 

గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవాలంటే..?

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ ద్వారా గ్రూప్ వాయిస్ కాల్స్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి బోటమ్ రైట్ కార్నర్‌లో కనిపించే డైలర్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించేందుకు మొదటి పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకుని వీడియో బటన్ పై క్లిక్ చేయండి. కాల్ కనెక్ట్ అయిన తరువాత స్ర్కీన్ పై కనిపించే యాడ్ పార్టిసిపెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇదే విధమైన ప్రొసీజర్‌ను ఫాలో అవుతూ మరింత మంది పార్టిసిపెంట్స్‌ను మీ గ్రూప్ వీడియో కాల్‌లో యాడ్ చేసుకోవచ్చు.

వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్..

వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్..

వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను సమర్థవంతంగా వినియోగించుకునే క్రమంలో మీ డివైస్ వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉండాలి. ఇదే సమయంలో యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.

 

 

Best Mobiles in India

English summary
How to use WhatsApp group calling feature.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X