ఏ ఏటీఎంలో డబ్బు ఉంది, అక్కడ క్యూ ఎలా ఉంది, ఇట్టే చెప్పేస్తుంది

Written By:

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు జనాలు డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రూ. 100 నోట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఏటీఎంల వెంట పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాటికి కొంచెం రిలీఫ్ నిస్తూ వాల్నట్ యాప్ ఓ పరిష్కారాన్ని కనుగొంది. తన యాప్ కు ఇప్పుడు ఓ సౌకర్యాన్ని జత చేసింది. ఈ యాప్ ద్వారా మీరు సమీపంలోని నగదు ఏ ఏటీఎంలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎలా పనిచేస్తుందో చూద్దాం.

వాట్సప్ వీడియో కాలింగ్ వచ్చేసింది: పొందండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాల్నట్ యూజర్ తో వివరాలు సేకరణ

వాల్నట్ యూజర్ ఎవరైనా ఏటీఎంలో నగదు తీసుకుంటే ఆ ఏటీఎం, అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారు వంటి వివరాలను వాల్నట్ యాప్ వారి నుంచి సేకరిస్తుంది.

రంగుల్లో

తక్కువ క్యూ ఉన్న ఏటీఎంలు, ఎక్కువ క్యూ ఉన్నవి, నగదు లేని ఏటీఎంలను గ్రీన్, ఆరెంజ్, గ్రే రంగుల్లో సూచిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా తెలుపుతుంది

మీకు ఏటీఎంల దగ్గర పెద్ద క్యూ ఉంటే రెడ్ పిన్, అలాగే తక్కువ క్యూ ఉంటే ఆరెంజ్ పిన్, ఏటీఏంలు పనిచేయకుంటే గ్రే పిన్ చూపిస్తుంది.

18 లక్షల మంది వాల్నట్ యూజర్లు

దీని ద్వారా మొత్తం 18 లక్షల మంది వాల్నట్ యూజర్లు సమీపంలో ఏ ఏటీఎంలో నగదు ఉందో తెలుసుకునే వీలుంది.

ఏటీఎంలో నగదు తీసుకుంటే

మీరు కూడా ఏటీఎంలో నగదు తీసుకుంటే వెంటనే అందులో మీరు అక్కడి పరిస్థితులను నమోదు చేస్తే కొంతమందికి సాయం చేసిన వారవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Walnut mobile app can help you find an ATM that is active read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot