గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్

|

గూగుల్ యొక్క అన్ని యాప్ లకు ప్రత్యామ్నాయంగా ఉండే యాప్ ల పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రముఖ చైనా సంస్థ హువాయి ఇండియా వైపు చూస్తున్నది. వీటి యొక్క కొత్త పరిష్కారం కోసం కంపెనీ భారతీయ డెవలపర్‌లతో ఇప్పటికే చాలా చురుకుగా పనిచేస్తున్నదని తెలిపారు.

గూగుల్
 

గూగుల్ యొక్క ముఖ్య యాప్ లైన మ్యాప్స్, పెమెంట్స్ మరియు మెసేజింగ్ వంటి యాప్ లకు ప్రత్యామ్నాయాలను డిసెంబర్ చివరి నాటికి అభివృద్ధి చేయాలని హువాయి అధిక ధీమాగా ఉంది.

ఒకే సారి మూడు ఫోన్లను ఛార్జ్ చేసే షియోమి 60W ఫాస్ట్ ఛార్జర్‌

హువాయి

హువాయి సంస్థ మరియు దాని ఉప-బ్రాండ్ హానర్ రెండు ప్రస్తుతం గూగుల్ మీడియా సర్వీస్ (GMS) వాడకంపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. గూగుల్ యొక్క ఎటువంటి అప్లికేషన్లు లేకుండా హువాయి ప్రీమియం మేట్ 30 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అయితే హువాయి తన హోంలో పెరిగిన హువాయి మీడియా సర్వీసెస్ (HMS) పై బెట్టింగ్ చేస్తోంది.

2019 లో U.S ఆర్మీ యొక్క అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ

హానర్ ఇండియా CEO

"ఇప్పుడు మాకు మా స్వంత HMS ఉంది. దీనితో పాటు మొబైల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. నావిగేషన్, పెమెంట్స్, గేమింగ్ మరియు మెసేజింగ్ వంటి చాలా ముఖ్యమైన యాప్ లు డిసెంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయి "అని హువాయి మరియు హానర్ ఇండియా CEO చార్లెస్ పెంగ్ మీడియా సమావేశంలో చెప్పారు.

గూగుల్ యాప్
 

గూగుల్ యాప్ ల మాదిరిగానే హువాయి మీడియా సర్వీసెస్ (HMS) యాప్ లు ప్రజల దృష్టిని చాలా త్వరగా ఆకట్టుకుంటాయని పెంగ్ నమ్మకంగా ఉన్నారు. హువాయి తన సూట్ కింద 100 నుండి 150 అప్లికేషన్లను అందించాలని యోచిస్తోంది.

గూగుల్ పే ద్వారా RS.2020లు బహుమతిగా పొందే అవకాశం...

GMS VS HMS

"వినియోగదారులు గూగుల్ మీడియా సర్వీసెస్ (GMS) మరియు హువాయి మీడియా సర్వీసెస్ (HMS)ల మధ్య వ్యత్యాసాన్ని చూడలేరు. కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి డెవలపర్‌లతో కలిసి ఎలా పని చేయాలనే దానిపై మేము ఎక్కువ దృష్టిని పెడుతున్నాము. ఇది మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సవాలు" అని ఆయన తెలిపారు.

న్యూ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎకోసిస్టమ్

అయినప్పటికీ హువాయి సంస్థ స్థానికంగా అభివృద్ధి చెందిన సాఫ్ట్‌వేర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించే ప్రయత్నంలో ఒంటరిగా లేదు. "న్యూ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎకోసిస్టమ్" ను ఏర్పాటు చేయడానికి భారతదేశంలో డెవలపర్ల సహాయం కోసం ఒప్పో సంస్థ 2020 లో $143 మిలియన్లను కేటాయించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

కలర్‌ఓఎస్ 7

కలర్‌ఓఎస్ 7 ను ప్రారంభించడానికి ఒప్పో ఇటీవల ఇండియాలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజా సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో భారతీయ వినియోగదారుల అవసరాలపై కూడా ఇది ఎక్కువగా దృష్టి పెడుతున్నది.

హాట్‌స్టార్,Voot యాప్ లను ఉచితంగా అందిస్తున్న జియోఫైబర్

ఒప్పో

భారతీయ వినియోగదారుల కోసం ఒప్పో సంస్థ రూపొందించిన కలర్‌ఓఎస్ 7లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఉదాహరణకు ‘డాక్‌వాల్ట్' కోసం డిజిలాకర్‌తో కలిసి పనిచేయడం. అంతర్దృష్టి రూపకల్పనలో ఇండియా యొక్క డిజైన్ బృందంతో ఒప్పో షెన్‌జెన్ డిజైన్ బృందం కలిసి పనిచేయడం జరుగుతుంది.

జియో "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌" వివరాలు

లోకలైజడ్ ఫీచర్స్

వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా బైక్ మోడ్ మరియు మ్యూజిక్ పార్టీ వంటి ఫీచర్లను కూడా ఒప్పో సంస్థ పరిచయం చేసింది. భవిష్యత్తులో ఇండియా డిజైన్ బృందం పెరుగుతున్న కొద్దీ భారత మార్కెట్‌కు కావలసిన మరిన్ని లోకలైజడ్ ఫీచర్స్ మరియు సొల్యూషన్లను ప్రారంభిస్తాము అని ఒప్పో ప్రొడక్ట్ డిజైన్ డైరెక్టర్ క్రిస్ చెన్ తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Huawei Plan to Launch Own Apps compete with Google Apps in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X