Home
Apps

Telegram Ban టెలిగ్రామ్‌పై నిషేధం విధిస్తే.. ఈ మెసేజింగ్‌ యాప్‌లను ప్రయత్నించవచ్చు..!!

టెలిగ్రామ్ సీఈవో పావెల్‌ దురోవ్‌ (Telegram) ఐదు రోజుల క్రితం పారిస్‌లో అరెస్ట్‌ అయ్యారు. దీంతోపాటు భారత్‌ ప్రభుత్వం కూడా టెలిగ్రామ్‌ పై దర్యాప్తు చేస్తోంది. కేంద్ర హోం శాఖ, ఎలక్ట్రానిక్స్‌, సమాచార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. దోపిడీ, జూదం వంటి ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు భారత్‌లో టెలిగ్రామ్‌ నిషేధానికి దారితీయవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టెలిగ్రామ్ సీఈవో పావెల్‌ దురోవ్ అరెస్ట్‌ పై ఆ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిజిటల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌లు సహా ఐరోపా సమాఖ్య చట్టాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. కంటెంట్ మోడరేషన్ లోనూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ప్లాట్‌ఫాం దుర్వినియోగానికి సంస్థ లేదా యజమానిని బాధ్యత వహించాలనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది.

telegram

భారత్‌లో గతంలోనూ టెలిగ్రామ్‌ అనేక విమర్శలను ఎదుర్కొంది. గత సంవత్సరం పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని టెలిగ్రామ్‌ సహా ఇతర ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే తాజాగా టెలిగ్రామ్‌ పై నిషేధం వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెసేజింగ్‌ యాప్‌లు ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

టెలిగ్రామ్‌కు ప్రత్యామ్నాయ మెసేజింగ్‌ యాప్‌లలో ప్రధానమైనది వాట్సాప్‌ (Whatsapp). మెటా నేతృత్వంలోని వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3 బిలియన్‌ల మంది వినియోగిస్తున్నారు. యూజర్లకు మెరుగైన భద్రత కల్పిస్తుంది. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. వ్యక్తిగత చాటింగ్‌, గ్రూప్‌ చాట్‌, వాయిస్‌, వీడియా కాల్స్‌ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది.

సిగ్నల్‌ యాప్‌ : టెలిగ్రామ్‌ తరహాలోనే ఈ సిగ్నల్‌ యాప్‌ (Signal) కూడా మెరుగైన భద్రతను అందిస్తుంది. ఈ సిగ్నల్‌ యాప్‌ ద్వారా గ్రూప్‌ చాట్‌, వాయిస్‌ మరియు వీడియో కాల్స్ మరియు స్టేటస్‌ అప్‌డేట్‌లు వంటి ఫీచర్‌లను పొందవచ్చు. పటిష్ఠమైన సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.

ThickClient : ఈ మెసేజింగ్ యాప్‌ కూడా మెరుగైన భద్రతా వ్యవస్థను కలిగి ఉంటుంది. గ్రూప్‌ చాట్‌, స్టేటస్‌ అప్‌డేట్‌, వాయిస్‌, వీడియో కాల్స్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మెసెజ్‌లను ఆటో డిలీట్‌ చేసే ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

Mattermost : ఈ బిజినెస్‌ మెసేంజర్‌ యాప్‌ ( Mattermost App ) అత్యంత మెరుగైన భద్రతను కలిగి ఉంటుంది. ఈ యాప్‌ లో వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్‌ చాట్‌, స్టేటస్‌ అప్‌డేట్‌ లు వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
if center bans telegram here are the best alternative apps in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X