ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు

దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. భారత పోస్టు బ్యాంకు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

|

దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. భారత పోస్టు బ్యాంకు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తపాలా బ్యాంకింగ్ సేవలు దేశంలోని దాదాపు అన్ని శాఖల్లో గల మూడు లక్షల మంది పోస్టుమ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడనున్నాయి. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)గా పరిగణించే ఈ పోస్టల్ బ్యాంకింగ్ సేవలు ఇపుడున్న ఇతర బ్యాంకింగ్ సేవలకేమీ తీసిపోవు. దీని గురించి పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుందాం.

ఇండియాకి శాంసంగ్ ఝలక్, మేక్ ఇన్ ఇండియాకు దెబ్బ !ఇండియాకి శాంసంగ్ ఝలక్, మేక్ ఇన్ ఇండియాకు దెబ్బ !

రూ.లక్ష వరకు నగదు

రూ.లక్ష వరకు నగదు

పేమెంట్ బ్యాంక్స్ ఓ రకమైన బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. బ్యాంకులో జరిగే భారీ స్థాయి లావాదేవీలు కాకపోయినప్పటికీ ఈ సేవలతో చాలా మంది లాభపడుతున్నారు. రెగ్యులర్ బ్యాంకుల్లానే ఇవీ పనిచేస్తాయి... రూ.లక్ష వరకు నగదు బదిలీ చేసేందుకు కూడా వీలుంటుంది.

రుణం పొందేందుకు వీలుండదు

రుణం పొందేందుకు వీలుండదు

ఇక్కడ మాత్రం రుణం పొందేందుకు వీలుండదు. నగదు బదిలీతో పాటు, బిల్ పేమెంట్స్, మర్చంట్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. భారత్‌లో పేమెంట్ సేవలు ఆర్థిక వ్యవస్థలో భాగంగా నచికేత్ మోర్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు అయ్యాయి. .

మొబైల్ ద్వారా..

మొబైల్ ద్వారా..

మొబైల్ ద్వారా నగదు చెల్లింపులు, నగదు బదిలీ, కొనుగోళ్లు, ఏటీఎం/డెబిట్ కార్డుల సర్వీసులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్ పార్టీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సౌకర్యాలు పోస్టల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చునని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

650 పోస్టల్ శాఖలు..

650 పోస్టల్ శాఖలు..

ఆ తర్వాత పోస్టల్ బ్యాంక్ సేవలు దేశవ్తాప్యంగా గల 650 పోస్టల్ శాఖలు, 3,250 పాయింట్ల ద్వారా పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఏ అకౌంట్‌లోనైనా డిపాజిట్ చేసిన సొమ్ము లక్ష రూపాయలు దాటితే అది ఆటోమేటిక్‌గా పోస్టల్ సేవింగ్స్ ఖాతాలోకి బదిలీ అవుతుందని ఆయన తెలిపారు.

మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్

మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్

పోస్టల్ బ్యాంక్‌ల ద్వారా వివిధ ఉత్పత్తులు, సర్వీసులు అందించడంతోపాటు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజ్‌లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ వంటి సేవలను కూడా అందించనున్నామని ఆయన పేర్కొన్నారు.

నాలుగు శాతం వడ్డీ

నాలుగు శాతం వడ్డీ

పోస్టల్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాదారులకు నాలుగు శాతం వడ్డీ ఉంటుందని ఆయన తెలిపారు. రుణాలు, ఇన్సూరెన్స్ వంటి థర్డ్ పార్టీ ఉత్పత్తుల కోసం ఆర్థిక సంస్థలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో జతకట్టామని ఆయన పేర్కొన్నారు.

1,435 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రతిపాదనకు..

1,435 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రతిపాదనకు..

ప్రస్తుతం మార్కెట్‌లో పేమెంట్ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్, పేటీఎం పేమెంట్ బ్యాంకుల నుంచి పోటీని తట్టుకునేందుకు వీలుగా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో వౌలిక సదుపాయాల కోసం 1,435 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గత వారం అంగీకరించిందని ఆయన తెలిపారు.

1.55 లక్షల పోస్టల్ బ్యాంకులు

1.55 లక్షల పోస్టల్ బ్యాంకులు

ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 1.55 లక్షల పోస్టల్ బ్యాంకులు, అనుబంధ పాయింట్ల ఏర్పాటు జరుగుతుందని, ఇందులో 1.30 లక్షల పాయింట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు.

నూటికి నూరు శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వానివే..

నూటికి నూరు శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వానివే..

భారత ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన పేమెంట్ బ్యాంకులో నూటికి నూరు శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వానివే. పోస్ట్ఫాసుల్లో మూడు లక్షల మంది పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌లు పనిచేస్తున్నారు.

మూడు రకాల సేవింగ్స్ అకౌంట్స్‌

మూడు రకాల సేవింగ్స్ అకౌంట్స్‌

ఐపీపీబీ మూడు రకాల సేవింగ్స్ అకౌంట్స్‌ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ సేవలను అందిస్తుంది. ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసిన సొమ్ముపై సాలీనా నాలుగుశాతం వడ్డీ చెల్లిస్తారు.

 వేగంగా నగదు డిపాజిట్

వేగంగా నగదు డిపాజిట్

కస్టమర్లకు వేగంగా నగదు డిపాజిట్, బదలాయింపు, నగదు విత్‌డ్రా సమాచారం మొబైల్ ఫోన్ల ద్వారా తెలుస్తుంది. ఐపీపీబీ ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్ నంబర్ 7738062873.

సేవ‌లు

సేవ‌లు

ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, క‌రెంట్ ఖాతాలు, న‌గ‌దు బ‌దిలీలు, ప్రత్యక్ష న‌గ‌దు బ‌దిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు తదితర సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

డిసెంబరు 31 కల్లా పూర్తి

డిసెంబరు 31 కల్లా పూర్తి

మొత్తం 1.55 ల‌క్షల పోస్టాఫీసు శాఖ‌ల‌ను ఐపీపీబీ బ్రాంచులుగా మారుస్తారు. ఈ ప్రక్రియ డిసెంబరు 31 కల్లా పూర్తికానుంది. దీంతో దేశంలో 650 శాఖలతో ఐపీపీబీ ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేనున్నాయి.

Best Mobiles in India

English summary
India Post Payments Bank Launched: 7 Facts Every Indian Should Know more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X