Home
Apps

టెలిగ్రామ్‌ను భారత్‌లో నిషేధించనున్నారా.. సీఈవో అరెస్ట్‌ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయ్‌?

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌ (Telegram) వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ను శనివారం సాయంత్రం పారిస్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అజర్‌బైజాన్‌ నుంచి పారిస్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్‌ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీ, మోసాల సమాచారం షేర్‌ చేయడం వంటి ఆరోపణలు దురోవ్‌ పైన ఉన్నాయి.

అయితే దురోవ్‌ అరెస్ట్ అనంతరం కొన్ని నివేదికలు కీలక అంశాలను ధ్రువీకరిస్తున్నాయి. నేరాలు మరికొన్ని ఆరోపణతో భారత ప్రభుత్వం కూడా ఈ ప్లాట్‌ఫాంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌.. టెలిగ్రామ్‌ పై చర్యల కోసం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

indian government investigation on telegram

మనీ కంట్రోల్‌ నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తు టెలిగ్రామ్‌పై భారత్‌లో నిషేధం విధించేందుకు కూడా దారితీయవచ్చని తెలుస్తోంది. భారత్‌లో గతంలోనూ టెలిగ్రామ్‌ విమర్శలను ఎదుర్కొంది. గత సంవత్సరం పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని టెలిగ్రామ్‌ సహా ఇతర ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

టెలిగ్రామ్ సీఈవో పావెల్‌ దురోవ్ అరెస్ట్‌ పై సంస్థ స్పందించింది. ఐరోపా సమాఖ్య చట్టాలు, డిజిటల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌లను అమలు చేస్తున్నట్లు తెలిపింది. కంటెంట్ మోడరేషన్ లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్లాట్‌ఫాం దుర్వినియోగానికి సంస్థ లేదా యాజమాని బాధ్యత వహించాలనడం హాస్యాస్పదంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపింది.

పావెల్‌ దురోవ్ అరెస్ట్ పై X (ట్విట్టర్‌) అధిపతి ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. దురోవ్‌ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దురోవ్‌ అరెస్ట్‌ను ఖండిస్తూ ఫ్రెంచి భాషలో పోస్ట్‌ చేశారు. మోడరేషన్‌ పేరుతో నిజాలను తొక్కిపెడుతున్నారని ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలు చేశారు.

పావెల్‌ దురోవ్‌ రష్యాలో జన్మించారు. టెలిగ్రామ్‌ను రష్యాలో 2013 లో పావెల్ దురోవ్‌ స్థాపించారు. దురోవ్‌కు చెందిన మరో యాప్‌ వీకొంటక్టే లో ప్రతిపక్షాల కమ్యూనిటీపై నిషేధం విధించాలన్న రష్యా ప్రభుత్వ ఒత్తిడితో 2014లో రష్యాకు దూరం అయ్యారు. ఈ యాప్‌ను అనంతరం విక్రయించారు. టెలిగ్రామ్‌పై రష్యా ప్రభుత్వం 2018 లో నిషేధం విధించి, 2021 లో ఎత్తివేసింది.

39 ఏళ్ల దురోవ్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. 15.5 బిలియన్‌ డాలర్ల తో అపర కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ యాప్‌ ను 900 బిలియన్‌ ల మంది వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
indian government investigation on telegram on criminal activities may leads to ban
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X