ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?

|

సోషల్ మీడియాలో మెసేజింగ్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న వాట్సప్ వాడకం మీద ఇండియాలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం దీనిపై కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Whatsappని ప్రభుత్వం నిషేధించే దిశగా ఆలోచన చేస్తున్నదనే కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సామాన్య ప్రజానీకంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా Whatsappని విచ్చలవిడిగా వాడడమని తెలుస్తోంది.

 

రూ.3,499కే shatterproof డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, జియో ఆఫర్‌తో..రూ.3,499కే shatterproof డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, జియో ఆఫర్‌తో..

హోం శాఖ నిర్ణయం తీసుకోనుందా

హోం శాఖ నిర్ణయం తీసుకోనుందా

కేంద్ర హోం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలు, పోలీస్ శాఖ ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయంపై పలు అంశాలను చర్చించాయి.

సంఘ వ్యతిరేక శక్తులు

సంఘ వ్యతిరేక శక్తులు

సంఘ వ్యతిరేక శక్తులు వాట్సప్ తో పాటు ఇతర మెసేజింగ్ యాప్ లో ఉన్న end-to-end encryption సర్వీస్ ఆప్సన్ ద్వారా చాలా సులభంగా తమ కార్యకలాపాలను ఆచరణలో పెడుతున్నారని ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి

ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి

ఇటీవల జమ్మూకాశ్మీర్లోని ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి వాట్సప్ కమ్యూనికేషన్ ద్వారానే పూర్తి చేయబడిందనే విషయాన్ని ఈ సమావేశంలో అధికారుల ప్రముఖంగా ప్రస్తావించారు.

దేశ వ్యతిరేక శక్తులు
 

దేశ వ్యతిరేక శక్తులు

అధికశాతం దేశ వ్యతిరేక శక్తులు తమ ఉగ్ర కార్యకలాపాల కోసం వాట్సప్‌ని తమ కమ్యూనికేషన్ కోసం ప్రధాన మీడియాగా వాడుకుంటున్నాయని ఈ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు.

వాట్సప్ మీద నిఘా పెట్టడానికి..

వాట్సప్ మీద నిఘా పెట్టడానికి..

వాట్సప్ మీద నిఘా పెట్టడానికి కూడా వీల్లేకుండా, యూజర్లకు అత్యంత మెరుగైన ప్రైవసీ అందిస్తున్నామనే పేరు చెప్పి వాట్సప్ ప్రవేశపెట్టిన end-to-end encryption చాలా ఇబ్బందికరంగా మారిందని వారు పేర్కొన్నారు.

ఇప్పటికే కొన్ని దేశాల్లో..

ఇప్పటికే కొన్ని దేశాల్లో..

ఇప్పటికే కొన్ని దేశాల్లో వాట్సప్ బ్యాన్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇండియాల కూడా వాట్సప్‌ని పూర్తిగా నిషేధించడం గానీ, లేదా వాట్సప్ వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలను నిషేధించడం గానీ చేస్తే మేలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.

దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు..

దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు..

ఈ నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటుందా అనేదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. మరి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి.

 

 

Best Mobiles in India

English summary
Indian Govt May Ban WhatsApp Use In Country, As It Is Terrorist's Favourite App For Messaging More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X