RailOne App : రైల్వే కొత్త యాప్ విడుదల.. టికెట్ల బుకింగ్, PNR, ఫిర్యాదులు, ట్రైయిన్ స్టేటస్ అన్నీ ఒకే చోట
భారతీయ రైల్వే తమ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేసింది. ఈ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్‌ను లాంచ్ చేశారు. తొలుత స్వరైల్ (Swarail) పేరుతో బీటా వెర్షన్‌ను విడుదల చేసిన రైల్వే.. తాజాగా కొత్త పేరుతో యాప్ ఫుల్ వెర్షన్‌ను విడుదల చేసింది.
రైల్‌వన్ యాప్ :
రైల్‌వన్ (RailOne) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS స్టోర్‌లతో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు రైల్వే టికెట్ల బుకింగ్, ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్, ట్రైయిన్ ట్రాకింగ్, PNR స్టేటస్ సహా వివిధ సర్వీసులకు ప్రత్యేక యాప్‌లు, వెబ్‌సైట్లు ఉన్నాయి.

అన్ని సర్వీసులు ఒకేచోట :
తాజాగా అందుబాటులోకి వచ్చిన రైల్‌వన్ యాప్‌తో అన్ని సర్వీసులను ఒకేచోటకు చేర్చింది. ప్రస్తుతం రైల్వే టికెట్లు బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్, అన్‌రిజర్వడ్ మరియు ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS యాప్ ఉన్నాయి. దీంతోపాటు రైల్వే ఫిర్యాదులు, ట్రావెల్ ఫీడ్‌బ్యాక్ కోసం రైల్ మదద్, ట్రాకింగ్ మరియు ట్రైయిన్ స్టేటస్ కోసం ప్రత్యేక వైబ్‌సైట్‌లు ఉన్నాయి.
రైల్‌వన్ యాప్‌తో ఈ సర్వీసులు అన్నింటినీ ఒకే చోట నుంచి నిర్వహించుకొనేందుకు అవకాశం ఉంది. మరియు వేర్వేరు ప్లాట్‌ఫాంలు, యాప్‌ల కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకొనేందుకు బదులుగా ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తో లాగిన్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్, mPIN ద్వారా లాగిన్ :
ప్రస్తుతం ఉన్న IRCTC రైల్‌కనెక్ట్, UTS యాప్‌ల యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ తోనూ ఈ కొత్త రైల్వే యాప్ రైల్‌వన్ లాగిన్ చేయవచ్చు. దీంతోపాటు mPIN మరియు బయోమెట్రిక్ ఆప్షన్‌ల ద్వారా కూడా కొత్త యాప్‌లోకి లాగిన్ కావచ్చు. కొన్ని నెలలపాటు టెస్టింగ్ చేసిన రైల్వే తాజాగా కొత్త యాప్‌ను లాంచ్ చేసింది.
* జులై 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆధార్ అథెంటికేషన్ చేసిన IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకోగలరు. దీంతోపాటు జులై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ద్వారా మాత్రమే తత్కాల్ టికెట్లను బుకింగ్ చేయగలుగుతారు.
ఏజెంట్లు బుకింగ్ వేళల్లోనూ కీలక మార్పులు రానున్నాయి. జులై 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా AC తత్కాల్ టికెట్లను ఉదయం 10 గంటలకు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏజెంట్లు మాత్రం 10:30 AM గంటల నుంచి మాత్రమే బుకింగ్ చేయగలుగుతారు. నాన్ ఏసీ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏజెంట్లు మాత్రం 11:30 గంటల నుంచి మాత్రమే బుకింగ్ చేయగలగుతారు.
* దీంతోపాటు ఇటీవలే రైల్వే బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. రైలు బయలు దేరడానికి 8 గంటల ముందుగానే ప్రయాణికుల ఛార్జ్‌ను వెల్లడించాలని ప్రతిపాదనలు చేసింది. మధ్యాహ్నం 2 గంటల కంటే ముందు బయలుదేరే రైళ్లకు.. ఆ ముందు రోజు రాత్రి 9 గంటలకు చార్జ్‌ను సిద్ధం చేయాలని తెలిపింది. ఇది అమల్లోకి వస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల ప్రయాణికుల ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకొనే అవకాశం ఉంటుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications








