ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTC

Written By:

రైలు ప్రయాణీకులకు IRCTC మంచి శుభవార్తను మోసుకొచ్చింది. ఇప్పటిదాకా IRCTC నుంచి వచ్చిన యాప్ లలో కేవలం ట్రైన్ బుకింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు దీనికి పుల్ స్టాప్ పెట్టి మరిన్ని యాప్స్ తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అటు ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల అంతర్గత అవసరాల కోసం దాదాపు 200 పైగా సరికొత్త అప్లికేషన్లను ఇండియన్ రైల్వే శాఖ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా IRCTC ఈ 200 అప్లికేష్లన్లను ఉద్యోగులకు అలాగే స్టాక్ హోల్డర్లకు, ట్రావెల్లర్స్ కు తీసుకురానుంది. కాగా Times of India పత్రిక ఈ విషయాలను రిపోర్ట్ చేసింది. IRCTC నుంచి త్వరలో రానున్న ముఖ్యమైన యాప్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

45 ఏళ్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఫోన్,ఆసక్తికర నిజాలివే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Rail MADAD

తమ ప్రయాణం గురించి, రైల్వే స్టేషన్లలో సదుపాయాల గురించి ప్రయాణీకులు కంప్లైంట్లు ఫైల్ చేసే విధంగా ఈ యాప్ రానుంది. ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయితే ఈ యాప్ ద్వారా తెలియపరచవచ్చు. కాగా ఈ యాప్ ఇప్పటికే పూర్తిగా రెడీ అయినట్లు సమాచారం.

Menu on Rails

ఈ యాప్ వివిధ రైల్వేస్టేషన్లలో విక్రయించబడే ఆహార పదార్థాల ధరల గురించి, అలాగే వివిధ రైళ్లలో సరఫరా చేయబడే ఆహారం మెనూ గురించి ప్రయాణీకులకు సమాచారం అందిస్తుంది.

IR SUGAM

ఇది సరకు రవాణాకు సంబంధించిన సమాచారాన్నిఅందిస్తుంది. ఈ యాప్ బిజినెస్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

వివిధ స్టేషన్లలో..

వీటితో పాటు వివిధ స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం ట్రాక్ చేసుకోవడానికి, స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు గురించి సమాచారం కోసం, వైఫై సదుపాయం కోసం, వివిధ స్టేషన్లు పునర్నిర్మాణం గురించి సమాచారం పొందడానికి, స్టేషన్లలోని కేటరింగ్ స్టాల్స్ గురించి సమాచారం పొందేలా.. ఇలా వివిధ అంశాల గురించి సమాచారం అందించేలా మొత్తం 200లకు పైగా అప్లికేషన్లను రైల్వే శాఖ తీసుకురాబోతోంది.

 

2016లో IRCTC మూడు యప్ లను ..

గతేడాది పాసింజర్ల సంఖ్య 5 నుంచి 8 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కాగా 2016లో IRCTC మూడు యప్ లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. paperless unreserved ticketing mobile application, handheld terminals for traveling ticket examiners (TTEs) ఇందులో ఉన్నాయి. వీటితో పాటు అన్ రిజర్వ్డ్ టికట్ల కోసం UTSONMOBILE యాప్ ని కూడా South Central Railway లాంచ్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Railways to Launch 200 Apps for Travelers, Employees More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot