Home
Apps

పెళ్లయ్యాక కూడా సీక్రెట్‌గా అక్రమ సంబంధాలు.. గ్లీడెన్‌ డేటింగ్ యాప్‌లో 30 లక్షల భారతీయులు..??

Gleeden India: భారతదేశంలో పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో, వైవాహిక బంధానికి ఎంత విలువనిస్తారో మనందరికీ తెలిసిందే. అలాంటి దేశంలో, వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ యాప్ 'గ్లీడెన్’ సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొన్నేళ్లలోనే ఈ యాప్‌ను వాడుతున్న భారతీయుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అక్షరాలా 30 లక్షల మంది యూజర్లు గ్లీడెన్‌లో చేరారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 270% వృద్ధి కావడం విశేషం.

పెళ్లైన వాళ్లు తమ వైవాహిక జీవితానికి వెలుపల రహస్య సంబంధాలు కోరుకుంటూ ఈ యాప్‌లో భాగమవుతున్నారు. ఈ పెరుగుదల చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే మనది సంప్రదాయాలకు, కట్టుబాట్లకు ప్రాధాన్యమిచ్చే దేశం. కానీ గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడ్డెల్ మాత్రం ఈ ట్రెండ్‌ను మరో కోణంలో చూస్తున్నారు.

India s Secret Affair  3 Million Users Flock to Gleeden  the Extra-Marital Dating App

సమాజంలో వస్తున్న మార్పులకు ఇది నిదర్శనమని ఆమె అంటున్నారు. ఆధునిక భారతదేశంలో సంబంధాలపై ప్రజల ఆలోచనలు మారుతున్నాయని, అందుకే గ్లీడెన్ ఇంత విజయవంతమైందని ఆమె అభిప్రాయపడుతున్నారు.

* గ్లీడెన్ అంటే ఏంటి?

గ్లీడెన్ అనేది ఆన్‌లైన్ డేటింగ్ వేదిక. దీన్ని మొదట ఫ్రాన్స్‌లో ప్రారంభించారు. ప్రత్యేకంగా పెళ్లైన వ్యక్తులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఈ యాప్‌ను రూపొందించారు. యూరోపియన్ యూనియన్‌లో ఈ యాప్ బాగా పాపులర్. గ్లీడెన్ యూజర్లలో 65% మంది యూరప్ నుంచే ఉన్నారు.

అయితే ఈ యాప్‌లో మహిళలు ఉచితంగా ఖాతా తెరిచి వాడుకోవచ్చు. ఇది కూడా గ్లీడెన్ పాపులర్ అవ్వడానికి ఒక కారణం. భారతదేశం ఇప్పుడు గ్లీడెన్‌కు అతిపెద్ద మార్కెట్‌గా మారింది. ఇక్కడ యాప్ వాడుతున్న వారి సంఖ్య చూస్తుంటేనే అర్థమవుతుంది, ప్రజలు సంబంధాలను కొత్తగా అర్థం చేసుకుంటున్నారని సిబిల్ షిడ్డెల్ అంటున్నారు.

ముఖ్యంగా మహిళలకు ఇది సురక్షితమైన, రహస్యమైన వేదిక అని, తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను గ్లీడెన్ ఇస్తుందని ఆమె తెలిపారు. ఆమె ఇలా వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సీక్రెట్‌గా అఫైర్ పెట్టుకొని ప్రోత్సహించినట్లే అనిపించింది. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని చెప్పవచ్చు.

* గ్లీడెన్ హవా ఎక్కడ ఎక్కువ

భారతదేశంలో బెంగళూరు నగరంలో గ్లీడెన్ యూజర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం యూజర్లలో 20% మంది ఇక్కడివారే. ముంబై రెండో స్థానంలో ఉంది (19%), కోల్‌కతా మూడో స్థానంలో (18%) నిలిచింది. ఢిల్లీలో 15% మంది యూజర్లు ఉన్నారు. చిన్న నగరాలైన భోపాల్, కొచ్చి, వడోదర వంటి ప్రాంతాల్లో కూడా గ్లీడెన్ వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటికే 30 లక్షల యూజర్లను చేరుకున్న గ్లీడెన్, మరిన్ని భారతీయ నగరాలకు విస్తరించాలని చూస్తోంది. అంతేకాదు, యూజర్లను ఆకట్టుకోవడానికి కొత్త ఫీచర్లను కూడా యాప్‌లో చేర్చడానికి ప్లాన్ చేస్తున్నారు. 2025 నాటికి యూజర్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* గ్లీడెన్ ఎందుకు ఇంత ప్రత్యేకం..

గ్లీడెన్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం దాని రహస్య సేవలే. పెళ్లైన వ్యక్తులు ఎలాంటి జంకు లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికను అందిస్తోంది. మన దేశంలో సంప్రదాయ విలువలకు ఇంకా ప్రాధాన్యం ఉన్నా, వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వేగంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లీడెన్ చాలా మందికి నచ్చుతోంది.

భారతీయులు తమ సంబంధాల గురించి కొత్తగా ఆలోచిస్తుండటంతో, గ్లీడెన్ ఈ మారుతున్న సంస్కృతికి అద్దం పడుతోంది. ప్రపంచంలోనే సంప్రదాయబద్ధమైన సమాజంగా పేరున్న మన దేశంలో, వివాహం, నిబద్ధత వంటి విషయాలపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయని గ్లీడెన్ వృద్ధి చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Gleeden, an extra-marital dating app, gains popularity in India reaching 3 million users. Driven by changing societal norms and demand for discreet relationships, the app witnesses significant user growth in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X