టిక్ టాక్ బ్యాన్, ప్రమాదకరంగా మారిన వీడియో యాప్

|

ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ '' టిక్ టాక్’’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో వచ్చిన డబ్ స్మాష్ లాగానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులరిటీ సంపాదించుకుంది.

Tik Tok Banned in Indonesia for Inappropriate Content

ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ యాప్ ను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు.అశ్లీల చిత్రాలు, మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్ లో వీడియోలను తయారు చేస్తున్నారు. దీంతో దీనిపై అన్ని దేశాలు నిషేధం ప్రకటిస్తున్నాయి.

 ఇండోనేషియాలో బ్యాన్

ఇండోనేషియాలో బ్యాన్

ఇండోనేషియాలో టిక్ టాక్ బ్యాన్ చేశారు. Chinese video app Tik Tokలో ఎక్కువగా ఫోర్నోగ్రఫీ కంటెంట్ సర్కులేట్ అవుతోందని ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారిందని అందుకే బ్యాన్ చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని Minister of Communications and Information మంత్రి Rudiantara మీడియాకు వెల్లడించారు.

టిక్ టాక్ ను బ్యాన్ చేయనున్న 7 రాష్ట్రాలు

టిక్ టాక్ ను బ్యాన్ చేయనున్న 7 రాష్ట్రాలు

దేశంలోని దాదాపు 7 రాష్ట్రాలు టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాయి. కేంద్రం కూడా 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్ లకు జారీ చేసింది. వాటికి సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 ఉద్యోగాలు పోగొట్టుకున్న వైనం

ఉద్యోగాలు పోగొట్టుకున్న వైనం

యువతను విశేషంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్‌తో చాలామంది చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పనులు పక్కన పెట్టి ఈ యాప్‌తో ఎక్కువ మంది కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్యోగులు టిక్ టాక్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ ఉద్యోగులపై బదిలీ వేటు పడింది.

టిక్ టాక్ బ్యాన్

టిక్ టాక్ బ్యాన్

అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయనే కంప్లయింట్లు వస్తున్నాయి. ఒక రిపోర్టు ప్రకారం.. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేయడానికి రెడీ ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ యువకుడు అమ్మాయి డ్రస్ వేసుకొని టిక్ టాక్ లో వీడియో చేసేందుకు ట్రయిన్ ముందు నుంచి దూకేశాడు. ఈయాప్ వినియోగిస్తోందని నాయనమ్మ తిట్టిందని..ముంబయిలో ఓ యువతి అయితే.. ఆత్మహత్య కూడా చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియాలో 25మిలియన్ల మంది ఈ యాప్ ని వినియోగిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Indonesia bans Chinese video app Tik Tok for ‘inappropriate content

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X