రూ.8,999కే 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫోన్,పరిమిత కాల ఆఫర్
హాంగ్ కాంగ్ కు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరే ఇన్‌ఫినిక్స్ ఎస్4 (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) వేరియంట్. కంపెనీ ఇదివరకే ఇన్‌ఫినిక్స్ ఎస్4 ఫోన్‌లో 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ వేరియంట్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసిన సంగతి విదితమే.

కాగా ఇన్‌ఫినిక్స్ ఎస్4లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,999కే అందుబాటులో ఉంటుంది. ఆగస్ట్ 8న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ ఎస్4 ఫీచర్లు
6.21 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అత్యంత తక్కువ ధరకే
ఇండియన్ మార్కెట్‌లో అదిరిపోయే కెమెరా ఫీచర్లతో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఒకేఒక్క స్మార్ట్‌ఫోన్ ఇన్‌ఫినిక్స్ ఎస్4 అని కంపెనీ తెలిపింది. బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు ప్రయత్నిస్తాం' అని ఇన్‌ఫినిక్స్ ఇండియా సీఈవో అనిశ్ కపూర్ తెలిపారు.

ఇన్ఫినిక్స్ నోట్ 4 ప్రొ, నోట్ 4
కాగా కంపెనీ ఇది వరకే ఇన్ఫినిక్స్ నోట్ 4 ప్రొ, నోట్ 4 పేరిట రెండు ఆండ్రాయిడ్ 4జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు చూసేందుకు అచ్చం షియోమీ ఫోన్లలాగే ఉండడం, వీటిల్లోని ఆండ్రాయిడ్ ఓఎస్ కూడా అచ్చం షియోమీ ఓఎస్ లాగే ఉండడం విశేషం. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ బోర్డాక్స్ రెడ్, క్వార్ట్ బ్లాక్, మ్యాజిక్ గోల్డ్ రంగుల్లో రూ.7,499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇక నోట్ 4 ఫోన్ ఐస్ బ్లూ, షాంపేన్ గోల్డ్, మిలాన్ బ్లాక్ రంగుల్లో రూ.8,999 ధరకు లభిస్తున్నది. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో రేపటి నుంచి లభ్యం కానున్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఇన్ఫినిక్స్ నోట్ 4 ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








