Home
Apps

Facebook మెసెంజర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ విలీనం!! సరికొత్త అప్‌డేట్ ఫీచర్స్ కూడా...

ప్రముఖ సోషల్ మీడియా యాప్ లలో ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లను చేయడానికి మెసెంజర్‌తో కనెక్ట్ చేసే ఎంపికను కొత్తగా ప్రారంభించింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుండే మెసెంజర్ యూజర్స్ నేరుగా ఎవరికైనా మెసేజ్ లను పంపడానికి అనుమతి లభిస్తుంది. ఫేస్‌బుక్ యొక్క బ్లాగ్ పోస్ట్ లో ఈ కొత్త అప్ డేట్ ను సంస్థ ప్రకటించింది. కొంతమంది వినియోగదారులు యాప్ ను ఓపెన్ చేసినప్పుడు ఈ కొత్త ఫీచర్ వారికి కనిపిస్తుంది. వినియోగదారులు వారి మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ DM‌లను వేరుగా కూడా ఉంచవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌డేట్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌డేట్ ఫీచర్

వినియోగదారులు ప్రస్తుతం వారి యొక్క ఫోన్లలో ఈ యాప్ ను అప్‌డేట్ చేస్తే కనుక ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత సరళమైన మరియు మెసెంజర్‌తో సమానంగా ఉండే మెసేజ్ యాప్ లభిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్ ఫార్వార్డింగ్ మరియు కస్టమ్ కలర్స్ మరియు మారుపేర్లతో చాట్ థ్రెడ్‌లను అనుకూలీకరించడం వంటి కొత్త ఫీచర్లను పొందుతారు.

 

ఇన్‌స్టాగ్రామ్‌ మెసెంజర్ కొత్త ఫీచర్స్

ఇన్‌స్టాగ్రామ్‌ మెసెంజర్ కొత్త ఫీచర్స్

సెల్ఫీ స్టిక్కర్లు, వాచ్ టుగెదర్ (ఇది స్నేహితులతో ట్రెండింగ్ వీడియోలను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది) మరియు వానిష్ మోడ్‌తో క్రొత్త ఫీచర్ల సమూహం అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక నిర్దిష్ట సమయం జోడించిన తర్వాత స్వయంచాలకంగా అదృశ్యమయ్యేలా మెసేజ్లను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొన్ని ఫీచర్లు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తాయి మరియు వెనువెంటనే మెసెంజర్‌కు వస్తాయని ఫేస్‌బుక్ తెలిపింది.

 

మెసెంజర్‌ - ఇన్‌స్టాగ్రామ్‌ విలీనం

మెసెంజర్‌ - ఇన్‌స్టాగ్రామ్‌ విలీనం

మెసెంజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోకి విలీనం చేయడం ద్వారా ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదానిని ఉపయోగిస్తున్న వ్యక్తులకు ప్రత్యేక యాప్ ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇతర ప్లాట్‌ఫారమ్‌లోని వ్యక్తులను కనుగొనడం మరియు సంప్రదించడం సులభం చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెసేజ్లు మరియు కాల్‌లు ఇన్‌స్టాగ్రామ్ యాప్ ద్వారా కూడా స్వీకరించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Instagram Direct Messages Integrated with Facebook Messenger
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X