Home
Apps

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి గుడ్‌న్యూస్‌.. అందరికీ అందుబాటులోకి Edits యాప్‌.. ఏమేం ఫీచర్‌లు ఉన్నాయంటే..!

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎడిట్స్‌ యాప్‌ను (instagram Edits App) తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, iOS స్టోర్‌లలో అందుబాటులో ఉంది. మూడు నెలల క్రితమే ఈ యాప్‌ గురించి ఇన్‌స్టా ప్రకటన చేసింది. మొబైల్‌ ద్వారా సులభంగా ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా హైక్వాలిటీ వీడియోను రికార్డు చేయవచ్చు మరియు ఎడిటింగ్ చేసుకోవచ్చు.

సులభంగా ఎడిటింగ్‌ :
ఈ ఎడిట్స్‌ యాప్‌ క్రియేటర్లకు అనుకూలంగా ఉంటుందని మెటా చెబుతోంది. ఈ యాప్‌లో ఉన్న అనేక టూల్స్‌ ద్వారా సులభంగా ఎడిటింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ ద్వారా తక్కువ సమయంలోనే మెరుగ్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు.

instagram Edits app launched in india here are the features and AI tools

అనేక ఫీచర్‌లు :
ఎడిట్స్‌ యాప్‌లో హై క్వాలిటీ వీడియో ఎడిటింగ్, ఎక్స్‌పోర్ట్‌, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్‌, అడ్వాన్స్‌ కెమెరా కంట్రోల్స్, ఆటో క్యాప్షన్స్‌, రియల్‌టైమ్‌ ఇన్‌సైట్స్‌, కంటెంట్‌ ట్రాకింగ్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి. వీటితోపాటు టచ్‌ అప్‌, గ్రీన్‌ స్క్రీన్‌, మ్యూజిక్‌ క్యాటలాగ్‌, టైమర్‌, కౌంట్‌డౌన్‌ వంటి అనేక టూల్స్ ఉన్నాయి.

వీడియో బ్యాగ్రౌండ్‌లోనూ మార్పులు :
వీడియో బ్యాగ్రౌండ్‌ ను కూడా మార్చుకొనేందుకు అవకాశం ఉంది. ఇందుకు గ్రీన్ స్క్రీన్‌, వీడియో ఓవర్‌లే ఫీచర్‌లు సపోర్టు చేస్తాయి. దీంతోపాటు ఆడియోలో ఎటువంటి నాయిస్‌ ఉన్నా.. క్లియర్ చేసేందుకు అవకాశం ఉంది. వాటర్‌ మార్క్‌ లేకుండా ఎక్స్‌పోర్టు చేయవచ్చు.

AI యానిమేషన్‌ :
ఈ యాప్‌ తో ఇమేజెస్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) యానిమేషన్ సాయంతో వీడియోగా క్రియేట్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు అడిషనల్ ఫాంట్స్‌, వాయిస్‌ ఎఫెక్ట్స్‌, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌, ట్రాన్సిసన్స్‌ వంటి క్రియేటివ్‌ ఆప్షన్స్‌ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కచ్చితమైన మూమెంట్స్‌ కోసం కీ ఫ్రేమ్‌లు ఉన్నాయి.

సూపర్‌ ఫీచర్‌లు :
కంటెంట్ క్రియేటర్లు కెమెరా సెట్టింగ్స్‌ల ఫ్రేమ్‌ రేట్‌, రిజల్యూషన్‌, డైనమిక్‌ రేంజ్ వంటివి సర్దుబాటు చేసుకోవచ్చు. వివిధ ట్రైం ఫ్రేమ్‌, సౌండ్, వాయిస్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లు, స్టిక్కర్‌లు సహా అనేక ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఎడిట్స్‌ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలతో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌తోపాటు ఇతర యాప్స్‌లోనూ పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది.

ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ టీన్‌ అకౌంట్స్‌ ను తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్నారులకు ప్రత్యేక ఖాతాలను అందిస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు మెటా ఇటీవల వెల్లడించింది. కొంత మంది చిన్నారులు తమ వయస్సును తప్పుగా పేర్కొని, పెద్దల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్‌ చేసుకుంటున్నారు.

వయస్సు ధ్రువీకరణ కోసం AI టూల్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. వయస్సు తక్కువగా ఉన్న ఖాతాలను టీన్‌ అకౌంట్స్‌గా మార్చేస్తోందని తెలిపింది. టీన్స్‌ అకౌంట్స్‌ కు అనేక నియంత్రణలు ఉంటాయి. రాత్రి సమయాల్లో నోటిఫికేషన్‌లు, 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇన్‌స్టా వినియోగిస్తుంటే నోటిఫికేషన్‌లతో అప్రమత్తం చేస్తుంది.

Best Mobiles in India

English summary
instagram Edits app launched in india here are the features and AI tools
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X