ఇన్‌స్టాగ్రామ్ "ఎడిట్స్" యాప్‌కు భారీ అప్‌డేట్.. ఇక వీడియో ఎడిటింగ్ వేరే లెవెల్..!
ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ (Edits) యాప్‌నకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. మొబైల్ ఫోన్లలోనే ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలు తయారు చేయాలనుకునే క్రియేటర్ల కోసం ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన ఈ యాప్, తాజాగా మరిన్ని ఆకట్టుకొనే ఫీచర్లను తీసుకొచ్చింది. కీ ఫ్రేమ్స్, మెరుగైన వాయిస్ ఎన్హాన్స్‌మెంట్, కొత్త టెక్స్ట్ ఎఫెక్ట్స్, మరింత స్మార్ట్‌గా మారిన ఐడియాస్ ట్యాబ్ వంటి టూల్స్‌తో 'ఎడిట్స్' యాప్ ఇప్పుడు మరింత ఆకట్టుకొనేలా అందుబాటులోకి వచ్చింది.
కీ ఫ్రేమ్స్ : ఎడిట్స్ యాప్‌లో తాజాగా కీఫ్రేమ్స్ టూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ టూల్‌తో క్రియేటర్లు తమ వీడియో క్లిప్‌లకు యానిమేషన్స్ జోడించవచ్చు. అంటే, వీడియోలో ఉండే ఎలిమెంట్స్ ఎలా కదలాలో, వాటి పొజిషన్, రొటేషన్, స్కేల్ వంటివి కచ్చితమైన ఫ్రేమ్‌ల వద్ద సెట్ చేసుకోవచ్చు.

దీనివల్ల స్మూత్ యానిమేషన్లు, సినిమాటిక్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం చాలా సులభమని ఎడిట్స్ చెబుతోంది. ఏదైనా సబ్జెక్ట్‌లోకి జూమ్ చేయాలన్నా, ఒక గ్రాఫిక్‌ను రొటేట్ చేయాలన్నా.. ఈ కీఫ్రేమ్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో యానిమేటెడ్ టెక్స్ట్, స్టిక్కర్లు, ఓవర్‌లేస్, కటౌట్స్ వంటివి కూడా తీసుకొస్తామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
ఐడియాస్ ట్యాబ్ : క్రియేటర్లకు కొత్త ఐడియాలు ఇవ్వడానికి, స్ఫూర్తినిచ్చేందుకు ఈ ఐడియాస్ ట్యాబ్‌ను డిజైన్ చేసినట్లు ఇన్‌స్టా చెబుతోంది. యూజర్లు తమకు నచ్చిన ఆడియో ట్రాక్‌లను సేవ్ చేసుకోవచ్చు, అలాగే క్రియేటివ్ రిమైండర్స్‌గా లేదా కంటెంట్ ప్లానింగ్ కోసం స్టిక్కీ నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
స్టిక్కీ నోట్స్‌ను సులభంగా ఎడిట్ చేయడానికి, ప్రివ్యూ చూసుకోవడానికి కొత్త ఫుల్-స్క్రీన్ ఎడిటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా రీల్స్ లేదా షార్ట్ వీడియోలు రెగ్యులర్‌గా చేసేవారికి ఈ అప్‌డేట్ కంటెంట్ ప్లానింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తుంది.

టెక్స్ట్ ఎఫెక్ట్స్, వాయిస్ ఎన్హాన్స్‌మెంట్ : వీడియోల్లో టెక్స్ట్ బాగా రావడానికి, ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌లో ఇప్పుడు 30కి పైగా కొత్త టెక్స్ట్ ఎఫెక్ట్స్ చేర్చారు. వీటిలో ఫిష్‌ఐ (Fisheye), ఆర్చ్ (Arch), యాంగిల్ (Angle), క్యూబ్ (Cube), వర్ల్ (Whirl) వంటి ఫన్నీ, ప్లేఫుల్ స్టైల్స్ ఉన్నాయి.
ఈ ఎఫెక్ట్స్ ద్వారా యూజర్లు తమ వీడియోలలో ముఖ్యమైన సందేశాలను, క్యాప్షన్లను లేదా క్రియేటివ్ ఎలిమెంట్స్‌ను మరింత హైలైట్ చేయవచ్చు, తద్వారా వీడియోలు మరింత ఎంగేజింగ్‌గా, చాలా సరదాగా మారతాయి. ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ "వాయిస్ ఎన్హాన్స్‌మెంట్" టూల్.
ఇంతకుముందు ఇది కేవలం వీడియో క్లిప్‌లకు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు వాయిస్‌ఓవర్‌లకు కూడా వాడుకోవచ్చు. దీనివల్ల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి, వాయిస్‌ను మరింత స్పష్టంగా మార్చుకోవచ్చు. తమ కంటెంట్‌లో ఎక్కువగా నెరేషన్ లేదా కామెంటరీపై ఆధారపడే క్రియేటర్లకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్.
ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌కు వచ్చిన ఈ కొత్త అప్‌డేట్స్ నిజంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. కీఫ్రేమ్స్, వాయిస్ ఎన్హాన్స్‌మెంట్, కొత్త టెక్స్ట్ ఎఫెక్ట్స్ వంటివి క్రియేటర్ల చేతికి మరిన్ని మంచి టూల్స్ అందించి, మొబైల్ వీడియో ఎడిటింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. ఇక వారి వీడియోలు మరింత ప్రొఫెషనల్‌గా, ఆకట్టుకునేలా అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








