Home
Apps

ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వారి కోసం ప్రత్యేక యాప్‌..! ఎందుకంటే..?

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను తీసుకొస్తోంది. తాజాగా ఓ లీక్‌ చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్ 2010 లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, iOS యూజర్‌లకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఐప్యాడ్‌ యూజర్‌లకు ప్రత్యేకంగా యాప్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ వివరాలను ది ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు వెల్లడించింది.

టిక్‌టాక్‌ బ్యాన్‌ పై చర్చల వేళ :
ప్రస్తుతం ఐప్యాడ్‌ యూజర్‌లు iOS వెర్షన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ను ఉపయోగిస్తున్నారు. పెద్ద స్క్రీన్‌ ను కలిగి ఉన్నా.. మెరుగైన అనుభూతిని అందించడం లేదని తెలుస్తోంది. అయితే టిక్‌టాక్‌ బ్యాన్‌ పై చర్చలు జరుగుతున్న వేళ.. ప్రస్తుతం ఉన్న గ్యాప్‌ ను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Instagram

ప్రత్యేకంగా యాప్‌ :
ఇందులో భాగంగా ఐప్యాడ్‌ కోసం ప్రత్యేకంగా యాప్‌ ను అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇన్‌స్టాగ్రామ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. టిక్‌టాక్‌ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ వ తేదీ వరకు గడువు విధించారు. ఈ తేదీలోగా టిక్‌టాక్‌ ను అమెరికా సంస్థకు విక్రయించాలని షరతు విధించారు. లేదంటే నిషేధాన్ని ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.

మరో 75 రోజులు గడువు :
అయితే ఈ గడువు ఇటీవల పూర్తయింది. తాజాగా మరో 75 రోజుల గడువు విధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ 90 సెకన్‌ లుగా ఉన్న రీల్స్‌ సమయాన్ని 3 నిమిషాల వరకు పొడిగించింది.

ఇటీవలే ఇన్‌స్టా హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి కీలక ప్రకటన చేశారు. కొత్తగా డిస్‌లైక్‌ బటన్‌ ను యాడ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిపారు. ఇన్‌స్టా కామెంట్స్‌ పక్కనే ఈ డిస్‌లైక్‌ బటన్ కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ కు ఎంత మంది డిస్‌లైక్‌ చేశారో ఇతరులకు తెలిసే అవకాశం లేదు.

పాజిటివ్‌ వాతావరణం :
ఈ ఫీచర్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ లో పాజిటివ్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇన్‌స్టా డిస్‌లైక్‌ బటన్ ప్రైవేట్‌ గా ఉంటుందని తెలుస్తోంది. ఇన్‌స్టా సిస్టమ్‌ మాత్రమే డిస్‌లైక్‌ లను ట్రాక్‌ చేస్తుందని సమాచారం.

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. చిన్నారులకు సురక్షితమైన ప్లాట్‌ఫాంను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టీన్ అకౌంట్స్‌ ను తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్నారుల ఇన్‌స్టా అకౌంట్స్‌ను వారి తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు. గత సంవత్సరం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన మెటా.. ఈ సంవత్సరం భారత్‌లోనూ తీసుకొచ్చింది.

క్రియేటర్స్‌ కోసం ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్‌ యాప్‌ను తీసుకొచ్చింది. iOS యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉంది. అయితే ఇన్‌స్టా రీల్స్‌ కోసమే ప్రత్యేకంగా యాప్‌లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ రీల్స్‌లో 3 నిమిషాల వీడియో కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Instagram expected to launch new app for ipad users here is the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X