2017లో లాంచ్ అయిన 10 కూల్ ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లు

|

ప్రముఖ ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్ 2017కుగాను పలు అత్యుత్తమ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ నేతృత్వంలో ముందుకు సాగుతోన్న ఈ యాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన అనుభూతులను చేరువచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోన్న అత్యుత్తమ ఫీచర్లలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఒకటి.

 
2017లో లాంచ్ అయిన 10 కూల్ ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లు

స్పాప్‌చాట్ స్టోరీస్ ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ ఫీచర్ గతేడాది కాలంగా స్థిరమైన అప్‌డేట్‌లను అందుకుంటోంది. ఈ ఏడాదికిగాను ఒక్క డిసెంబర్‌లోనే అనేక కొత్త ఫీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో యడ్ అయ్యాయి. 2017కుగాను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చిన 10 కూల్ ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టోరీస్ హైలైట్స్

స్టోరీస్ హైలైట్స్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొద్ది రోజుల క్రితమే స్టోరీస్ హైలైట్స్ పేరుతో ఓ కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది. ఈ ప్రయోగాత్మకమైన ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోని ప్రధానమైన అంశాలను హైలైట్ చేసుకునే వీలుంటుంది.

స్టోరీస్ ఆర్చివ్స్

స్టోరీస్ ఆర్చివ్స్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీసెంట్‌గా యాడ్ అయిన ఫీచర్లలో స్టోరీస్ ఆర్చివ్స్ ఒకటి. ఈ ఫీచర్ మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను 24 గంటల తరువాత ఆటోమెటిక్‌గా ఆర్చివ్ చేసేస్తుంది. ఈ స్టోరీస్ ఆర్చివ్ పూర్తిగా ప్రయివేట్‌గా ఉంటుంది. వీటిని మీరు మాత్రమే చూడగలుగుతారు. రెగ్యులర్ పోస్ట్ ఆర్చివ్ పక్కనే ఈ స్టోరీస్ ఆర్చివ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

జాయిన్ లైవ్ రిక్వెస్ట్స్
 

జాయిన్ లైవ్ రిక్వెస్ట్స్

ఈ ఏడాదికిగాను ఇన్‌స్టా‌గ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యుత్తమ ఫీచర్లలో ఇన్‌స్టా‌గ్రామ్ లైవ్ స్టోరీస్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీ లైవ్ వీడియోలోకి ఇతరులను చేర్చుకునే వీలుంటుంది. ఈ ఫీచర్‌తో కొంత రిస్క్ కూడా పొంచి ఉంది.

రీమిక్స్ అండ్ రీప్లే

రీమిక్స్ అండ్ రీప్లే

ఇన్‌స్టా‌గ్రామ్‌లోని డైరెక్ట్ మెసేజింగ్ సదుపాయాన్ని మరింత ఆధునీకరిస్తూ రీమిక్స్ అండ్ రీప్లే వంటి కొత్త ఫీచర్లు ఇటీవల యాడ్ అయ్యాయి. రీమిక్స్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లో యూజర్ తన సొంత ఫోటోను యాడ్ చేసుకోవటంతో దాని పై నచ్చిన విధంగా డ్రా చేయటంతో పాటు స్టిక్కర్స్‌ను కూడా యడ్ చేసుకునే వీలుంటుంది. రీప్లే ఆప్షన్ ద్వారా వీడియోస్ అలానే ఇమేజెస్‌కు ఎండ్‌లెస్ లూప్‌ను క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

ఫేస్ ఫిల్టర్స్

ఫేస్ ఫిల్టర్స్

ఈ ఏడాదికిగాను ఇన్‌స్టా‌గ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యుత్తమ ఫీచర్లతో ఫేస్ ఫిల్టర్స్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీ పోస్టుకు క్యూట్ బన్నీ ఫేస్ లేదా కడ్లింగ్ డాగ్ ఫేస్‌ను యాడ్ చేసుకునే వీలుంటుంది.

నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?

ఫాలో హ్యాష్‌ట్యాగ్స్

ఫాలో హ్యాష్‌ట్యాగ్స్

తమ యూజర్లను మరింతగా యంగేజ్ చేయించే క్రమంలో ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు హ్యాష్‌ట్యాగ్‌లను అనుసరిస్తూ ఫోటోస్, వీడియోస్, ఫ్రెండ్స్ అలానే తమకు నచ్చిన హాబీలను డిస్కవర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను ఫోలో అవటం అంటే వ్యక్తిని ఫాలో అవ్వటమే. ఈ హ్యాష్‌ట్యాగ్ ఆప్షన్ ద్వారా నచ్చిన టాపిక్‌లను సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

పోల్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్

పోల్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీసెంట్‌గా యాడ్ అయిన ఫీచర్లలో పోల్ స్టిక్కర్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు సంబంధించి ఓ ఇంటరాక్టివ్ పోల్ స్టిక్కర్‌ను ప్లేస్ చేసుకునే వీలుంటుంది. మీరు చేసిన పోల్‌కు సంబంధించిన రిజల్ట్స్ మీకు రియల్ టైమ్‌లో కనిపిస్తాయి.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ టు మొబైల్ వెబ్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ టు మొబైల్ వెబ్

కొద్ది రోజుల క్రితం వరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మొబైల్ యాప్‌లో దర్శనమిచ్చాయి. ఇటీవల లాంచ్ చేసిన అప్‌డేట్ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను కంప్యూటర్స్ అలానే మొబైల్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

స్టాండ్‌ఎలోన్ డైరెక్ట్ యాప్

స్టాండ్‌ఎలోన్ డైరెక్ట్ యాప్

అనధికారికంగా తెలియవచ్చిన సమచారం ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ మెసెంజర్ తరహాలో ఓ డైరెక్ట్ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి రాబోతోంది. టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పటికే కొంత మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారు.

రీగ్రామ్ బటన్

రీగ్రామ్ బటన్

ప్రస్తుతాని టెస్ట్ంగ్ ఫేజ్‌‌లో ఉన్న ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్‌లో మాదిరిగా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను కూడా షేర్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Instagram has received many new features such as Story Highlights, Story Archive, face filters, poll in Instagram Stories, join live requests and more.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X