గుడ్‌న్యూస్ చెప్పిన ఇన్‌స్టాగ్రామ్.. ఫోటోలను క్రాప్ చేయకుండానే అప్‌లోడ్ చేయవచ్చు..!
Instagram 3:4 Photos : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫోటోలు అప్‌లోడ్ చేసే యూజర్లు ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫోటోలను అప్‌లోడ్ చేసే సమయంలో కచ్చితంగా ఇన్‌స్టా సపోర్టు చేసే ఇమేజ్ ఫార్మాట్‌లో క్రాప్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి ధ్రువీకరించారు.
క్యాప్చర్ చేసిన ఫోటోలను క్రాప్ చేయకుండా :
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటి నుంచి 3:4 యాస్పెక్ట్ రేషియోలో ఫోటోలను అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుందని తెలిపారు. అంటే వర్టికల్ మోడ్‌లో క్యాప్చర్ చేసిన ఫోటోలను క్రాప్ చేయకుండా అప్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి నుంచి 1:1, 4:5, 3:4 యాస్పెక్ట్ రేషియోలో ఫోటోలను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

డిఫాల్ట్ ఇమేజ్ సైజ్ :
అనేక స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు 3:4 యాస్పెక్ట్ రేషియో డిఫాల్ట్ ఇమేజ్ సైజుగా ఉంది. ఫలితంగా ఆయా ఫోటోలను ఎటువంటి మార్పులు చేయకుండా ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ ఫోటోగ్రాఫర్‌లకు ఉపయోగపడుతుంది. ఈ కొత్త నిర్ణయం యూజర్లు అనుభూతిని మెరుగుపరుస్తుందని ఆడం మోస్సేరీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
* ఇన్‌స్టాగ్రామ్ యాప్ అప్‌డేట్ :
గూగుల్ పిక్సల్ ఫోన్‌ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జీ అవుతున్నాయని గూగుల్ గుర్తించింది. ఇందుకు గల కారణాలను వెల్లడించింది. గూగుల్ ఫోన్‌లలోని ఈ సమస్యకు ఇన్‌స్టాగ్రామ్ యాప్ కారణమని గూగుల్ చెబుతోంది. వెంటనే పిక్సల్ ఫోన్ యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను త్వరలో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
మే నెలలో వచ్చిన అప్‌డేట్ :
ఈ సంవత్సరం మే నెలలో వచ్చిన అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న పిక్సల్ ఫోన్ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిక్సల్ ఫోన్ 6 నుంచి ఫోన్ 9 సిరీస్ ఫోన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఈ సమస్యకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి :
ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ యాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బ్యాటరీ డిశ్చార్జీ సమస్య పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. అయితే బ్యాటరీ డిశ్చార్జీ సమస్యకు గల కారణాలను వెల్లడించలేదు. మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటుంటే.. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
బ్యాటరీ డిశ్చార్జీ సమస్య కేవలం గూగుల్ ఫోన్లకే పరిమితం అయిందా.. ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇదే సమస్య ఉందా లేదా అనే అంశంపై గూగుల్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గూగుల్ పిక్సల్ ఫోన్ యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తుంటే.. కచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ వెర్షన్ 382.0.0.49.84 ఉండేలా చూసుకోండి.
* గత నెలలో ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వీడియోలను సులభంగా ఎడిటింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌లో వీడియో రికార్డింగ్, 4K ఎక్స్‌పోర్ట్, డైరెక్ట్ షేరింగ్, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్, అడ్వాన్స్ కెమెరా కంట్రోల్స్, ఆడియో ఎన్‌హాన్స్‌మెంట్, ఆటో క్యాప్షన్స్, రియల్‌టైం ఇన్‌సైట్స్, కంటెంట్ ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








