Instagram లో ఇక యూజ‌ర్లు చాట్‌లోనే డైరెక్టుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు!

|

Meta సంస్థ‌కు చెందిన Instagram నిత్యం ఏదో ఒక కొత్త అప్‌డేట్‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే క్రియేట‌ర్ల కోసం ప‌లు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన సంస్థ‌.. తాజాగా మ‌రో కొత్త ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చే స‌న్నాహాలు చేస్తోంది. త‌మ ప్లాట్‌ఫాంపై Direct Payment ఫీచ‌ర్ తెస్తున్న‌ట్లు Meta గ్రూప్ సోమ‌వారం తెలిపింది. మెసేజ్‌ల ద్వారా వినియోగ‌దారులు గుర్తింపు క‌లిగిన చిన్న చిన్న వ్యాపారస్థుల నుంచి ఉత్ప‌త్తుల్ని కొనుగోలు చేయ‌వ‌చ్చని పేర్కొంది. ఇందుకు పేమెంట్ చేసే విధంగా మెసేజ్‌ల‌లో వెసులు బాటు క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

 
Instagram లో ఇక యూజ‌ర్లు చాట్‌లోనే డైరెక్టుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు!

బ్లాగ్‌పోస్ట్ లో పేర్కొన్న ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. Instagram ప్లాట్‌ఫాంపై పేమెంట్ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. యూజ‌ర్లు ఎవ‌రైనా ప్లాట్‌ఫాంలో అర్హ‌త లేదా గుర్తింపు క‌లిగిన చిన్న వ్యాపార‌స్థుల నుంచి వ‌స్తువుల్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందుకు త‌గ్గ‌ట్టు న‌గ‌దు చెల్లించ‌డం కోసం మెసేజ్ చాట్‌లో Payment ఫీచ‌ర్‌ ను పొందుతారు. త‌ద్వారా వినియోగ‌దారులు ఇక నుంచి త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుకు సంబంధించి అక్క‌డే చాట్‌లో వివ‌రాలు తెలుసుకుని.. అక్క‌డే నేరుగా ఆర్డ‌ర్ ప్లేస్ చేయ‌వ‌చ్చు.

Instagram లో ఇక యూజ‌ర్లు చాట్‌లోనే డైరెక్టుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు!

అంతేకాకుండా, ప్రొడ‌క్ట్ ట్రాకింగ్‌ను కూడా అక్క‌డే నేరుగా చాట్‌లో వ్యాపార‌స్థుడి నుంచి తెలుసుకోవ‌డానికి కూడా వీలు ఉంటుంది. ఇక పేమెంట్ ను మెటా పే ద్వారా చెల్లించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. త‌మ ప్లాట్‌ఫాం పై జ‌రిపే Payments, కొనుగోళ్లు పూర్తిగా సెక్యూర్‌గా, సుర‌క్షితంగా ఉంటాయ‌ని మెటా కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, మెటా తెస్తున్న ఈ ఫీచ‌ర్ ఈ కామ‌ర్స్ వ్యాపారాన్ని విస్తృత‌ప‌రిచే విధంగా కంపెనీకి దోహ‌ద‌ప‌డుతుంది.

ఇప్ప‌టికే 2020లో, మెటా సంస్థ‌ Facebook మరియు Instagram ప్లాట్‌ఫాంల‌లో యూజ‌ర్లు త‌మ‌కు కావాల్సిన‌ ఉత్పత్తులను సెర్చ్ చేసి, కొనుగోలు చేయడానికి వీలుగా షాప్‌ల‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వేదిక‌గా యూజ‌ర్లు తమ డిజిటల్ స్టోర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసుకునేలా కూడా ప్రోత్స‌హిస్తోంది.

ఇదే కాకుండా, కంపెనీ యూజ‌ర్లు, క్రియేట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు ఇటీవల చాలా స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తోంది. గ‌త జ‌న‌వ‌రిలో కంపెనీ, USలోని క్రియేటర్‌ల కోసం Subscription ఫీచర్ యొక్క మొదటి వెర్షన్‌ను ప్రకటించిన విష‌యం తెలిసిందే. గ‌త వారం కూడా క్రియేట‌ర్ల‌ను ఆక‌ర్షించే విధంగా ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. కంపెనీ సబ్‌స్క్రైబర్ చాట్‌లు, సబ్‌స్క్రైబర్ రీల్స్, సబ్‌స్క్రైబర్ పోస్ట్‌లు మరియు సబ్‌స్క్రైబర్ హోమ్‌లను పరిచయం చేసింది. సబ్‌స్క్రైబర్ హోమ్ ట్యాబ్ కింద, వినియోగదారులు తమకు మాత్రమే అందుబాటులో ఉండే పోస్ట్‌లను ఫిల్టర్ చేయగలుగుతారు.

Instagram లో ఇక యూజ‌ర్లు చాట్‌లోనే డైరెక్టుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు!

Instagram ఇటీవ‌ల‌ ప‌రిచ‌యం చేసిన కొత్త ఫీచ‌ర్ల‌లో కొన్నింటి గురించి చ‌ర్చించుకుందాం:
90-సెకన్ల రీల్స్:
ఇది భారీ మార్పు. ఇప్పటి వరకు రీల్స్ 60 సెకన్లు మాత్రమే ఉండేవి మరియు ఇప్పుడు 90 సెకన్లకు పెంచబడింది.ఈ పరిమితి లోతైన కథనాలను చెప్పడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది. "మీ గురించి మరింత పంచుకోవడానికి, తెరవెనుక అదనపు క్లిప్‌లను చిత్రీకరించడానికి, మీ కంటెంట్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను లోతుగా తీయడానికి లేదా ఆ అదనపు సమయంతో మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా" అని కంపెనీ పోస్ట్ లో పేర్కొంది.

 

కొత్త సౌండ్ ఎఫెక్ట్స్:
"మీరు ఎప్పుడైనా మ్యూట్‌లో హారర్ మూవీని చూసినట్లయితే, ఉత్కంఠను పెంచడానికి మరియు వీక్షకులను ఉత్తేజపరిచేందుకు ధ్వని ఎంత విలువైనదో మీకు తెలుస్తుంది. రీల్స్ లేదా ఏ రకమైన వీడియో కంటెంట్‌కైనా ఇదే వర్తిస్తుంది," అని పోస్ట్ చెబుతోంది, ఎయిర్ హార్న్స్ (అయితే వాటిని ఎవరు అడిగారు అని ఆశ్చర్యం), క్రికెట్‌లు మరియు డ్రమ్స్ వంటి కొత్త సౌండ్ ఎఫెక్ట్‌లను ఈ ఫీచర్ జోడిస్తుంది.

Instagram లో ఇక యూజ‌ర్లు చాట్‌లోనే డైరెక్టుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు!

ఇంటరాక్టివ్ స్టిక్కర్లు:
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ నుండి మీకు తెలిసిన మరియు ఇష్టపడే అనేక ఇంటరాక్టివ్ స్టిక్కర్‌లు ఇప్పుడు రీల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా, పోల్‌లు, క్విజ్‌లు మరియు ఎమోజి స్లయిడర్‌లు వంటి అనేక ఇతర ఫీచర్‌లు కూడా రీల్స్‌కి జోడించబడ్డాయి.

Best Mobiles in India

English summary
Instagram Introduces Feature to Allow Users to Shop Directly in Chats

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X