Home
Apps

ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌.. నచ్చినవారు మాత్రమే పోస్టులు చూసేలా యూజర్లకు మరింత ప్రైవసీ..!!

మెటా నేతృత్వంలోని ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram latest Feature) ఇటీవల కాలంలో కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇన్‌స్టాను వినియోగించే టీనేజర్ల కోసం నైట్‌టైం నడ్జెస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అయితే తాజాగా యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించే దిశగా మరో ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్లిప్‌సైడ్‌ ఫీచర్‌ : ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్లిప్‌సైడ్‌ (Instagram Flipside) అనే కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తోంది. ఈ ఫీచ‌ర్‌ వినియోగదారులు.. కుటుంబ సభ్యులు సహా ఇతర సన్నిహిత వ్యక్తులకు మాత్రమే తమ సమాచారం, పోస్టులు షేర్‌ చేసే అవకాశం కల్పిస్తుందని, ఫిన్‌స్టాస్‌ సమస్యకు చెక్‌ పెడుతుందని తెలుస్తోంది.

instagram is testing flipside feature

వినియోగదారుల స్పందనకు అనుగుణంగా నిర్ణయం : ఈ కొత్త ఫీచర్‌పై ఇన్‌స్టా హెడ్‌ ఆడమ్‌ మోస్సేరీ స్పందించారు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాలో కచ్చితంగా ప్రవేశపెడతామని తాము చెప్పలేమని, ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉందని, ప్రజల నుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారులకు ప్రైవేట్‌ స్పేస్‌ను సృష్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇన్‌స్టాగ్రామ్‌ మరో ప్రతినిధి తెలిపారు.

అయితే ఈ ఫీచర్‌ సెకండరీ ప్రొఫైల్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది. కస్టమ్ నేమ్‌, ఫోటో, బయోతో కూడిన మరో ప్రోఫైల్‌ను క్రియేట్‌ చేయవచ్చని తెలుస్తోంది. సన్నిహితులకు మాత్రమే చేరేలా కంటెంట్‌, వీడియో, రీల్స్‌ను పోస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఇన్‌స్టా వెల్లడించలేదు.

instagram is testing flipside feature

* ఇన్‌స్టా ఇటీవల మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. అర్ధరాత్రి సమయంలో ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడపకుండా ఈ ఫీచర్‌ నియంత్రించనుంది. నైట్‌టైం నడ్జెస్ పేరుతో ఈ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. ప్రస్తుతం అత్యధిక శాతం మంది యూజర్ల రీల్స్‌ చూస్తూ ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారు. పగటి పూట సహా అర్ధరాత్రి వేళల్లోనూ సోషల్‌ మీడియాలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రవర్తన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ నైట్‌టైం నడ్జెస్‌ ఫీచర్‌ అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 నిమిషాల పాటు గడిపినప్పుడు.. ఓ అలెర్ట్‌ను ఇన్‌స్టా జారీ చేసింది. మీరు పరిమితికి మించి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపారు, కాబట్టి యాప్‌ను క్లో్జ్‌ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఓ అలెర్ట్‌ను ఈ ఫీచర్‌ జారీచేయనుంది. ఈ అలెర్ట్‌తో వారి నిద్ర సమయాన్ని గుర్తుచేసినట్లు ఉంటుందని, ఫలితంగా సోషల్‌ మీడియా నుంచి బయటకు వచ్చి నిద్రపోయే అవకాశం ఉంటుందని మెటా సంస్థ భావిస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
meta owned platform instagram is now testing flipside feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X