వచ్చే ఏడాది ఇండియాకి ఇన్‌స్టా‌గ్రామ్‌ నుంచి అదిరిపోయే ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్... సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉండే ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్.

|

ఇన్‌స్టాగ్రామ్... సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉండే ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్.ప్రతి దశలోనూ తన సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ, ప్రతి రోజూ కొత్తగా చేరుతున్న వేలకొలదీ వినియోగదారులతో ముందుకు దూసుకుని పోతూ ఉంది. వీటిల్లో ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ పొందుపరచిన సరికొత్త ఫీచర్లలో “నేం టాగ్” ఫీచర్ కూడా ఒకటి. సాధారణంగా ఇతరులను మిమ్ములను అనుసరించడానికి, తరచుగా మీ ప్రొఫైల్ను వారితో పంచుకోవడం జరుగుతుంటుంది. దీని వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి, ఈ సమస్యలను నివారించేందుకు మీ ప్రొఫైల్ కోడ్ ను సాధారణ స్కాన్ సహాయంతో సులభంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ వెసులుబాటును కల్పిస్తుంది. అనగా మీ ప్రొఫైల్ గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ వచ్చిన కొద్ది రోజులకు ఈ ఫోటో షేరింగ్ యాప్ బై బటన్ ని ఇండియాకి తీసుకొస్తోంది.

దోమల అంతు చూసేందుకు గూగుల్ కొత్త వ్యూహందోమల అంతు చూసేందుకు గూగుల్ కొత్త వ్యూహం

బైబటన్

బైబటన్

ఫేస్ బుక్ ఆధీనంలో ఉన్న ఇన్‌స్టా‌గ్రామ్‌ వచ్చే ఏడాది నుంచి వినియోగదారుల కోసం షాపింగ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు ఇకపై మీ ఇన్‌స్టా‌గ్రామ్‌ యాప్ నుండే నేరుగా షాపింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా బై బటన్ ని తీసుకొస్తోంది.

బటన్ ఉపయోగం

బటన్ ఉపయోగం

మీరు ఇన్‌స్టా‌గ్రామ్‌ యాప్ లో ఉన్న బై బటన్ ని క్లిక్ చేయగానే నేరుగా మీరే ఏ పేజీనైతే క్లిక్ చేశారు ఆ సెల్లర్ వెబ్ పేజీలోకి వెళుతుంది. తద్వారా యూజర్లు తమకు నచ్చిన ఉత్పత్తులను నేరుగా అక్కడి నుండే కొనుగోలు చేయవచ్చు.

 

 

యుఎస్ లో ప్రయోగం

యుఎస్ లో ప్రయోగం

కాగా ఈ ఫీచర్ ని యుఎస్ లో 2016 నుంచి ప్రయోగిస్తున్నారు. అక్కడ ఈ ఫీచర్ విజయవంతం కావడంతో ఆ తర్వాత దీన్ని 46 దేశాలకు విస్తరించారు. కాగా అక్కడ ఈ ఫీచర్ విజయవంతం కావడం వల్ల మరిన్ని దేశాలకు దీన్ని విస్తరించేందుకు కంపెనీ రెడీ అయింది. ఇందులో ఇండియా కూడా ఉంది.ఈ విషయాన్ని ETtech రిపోర్ట్ చేసింది.

90 మిలియన్ అకౌంట్లు

90 మిలియన్ అకౌంట్లు

ఇన్‌స్టా‌గ్రామ్‌ చెప్పిన వివరాల ప్రకారం ప్రతి నెలా 90 మిలియన్ అకౌంట్లు ఈ షాపింగ్ ఫీచర్ మీద ట్యాప్ చేస్తున్నాయని తెలిపింది. ప్రొడక్ట్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇన్‌స్టా‌గ్రామ్‌ వాల్ మీద ప్రత్యక్షమవుతుంది.

 

 

20 products

20 products

ప్రతి మెంబర్ 5 ప్రొడక్ట్ ల ఇమేజ్ లేక వీడియోలను అలాగే 20 ప్రొడక్టుల సమాచారాన్ని పేజీ నుండి తెలుసుకోవచ్చు. అలాగే సెల్లర్లు వీడియోలు ఇమేజ్ లను స్టిక్కర్ ద్వారా యాడ్ చేసుకోవచ్చని ఇన్‌స్టా‌గ్రామ్‌ టీం చెబుతోంది. అలాగే ఈ ఉత్పత్తులను షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తోంది.

పేమెంట్

పేమెంట్

కాగా ఇన్‌స్టా‌గ్రామ్‌ పేజీ నుండే నేరుగా పేమెంట్ చెల్లించేలా ఈ మధ్య ఫీచర్ ని తీసుకువచ్చిన సంగతి విదితమే. సింపుల్ ప్రాసెస్ లో ఈ కామర్స్ షాపింగ్ అయ్యేలా ఇన్‌స్టా‌గ్రామ్‌ బై బటన్ లో మార్పులు చేర్పులను చేసింది. యూజర్లు సమయాన్ని కూడా ఆదా చేసుకునే విధంగా ఇది అందుబాటులోకి వచ్చింది.

 

 

Best Mobiles in India

English summary
You will be able to shop on Instagram from next year more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X