ఇన్‌స్టాగ్రామ్ DMలో కొత్త ఫీచర్లు.. మ్యూజిక్ షేరింగ్, మెసేజ్ షెడ్యూలింగ్, చాట్ పిన్స్, ట్రాన్స్‌లేషన్ కూడా..!
Instagram: ప్రముఖ ఫొటో వీడియో షేరింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్ నిత్యం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌ల (DM) కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. చాటింగ్‌ను మరింత సులువుగా, సరదాగా, ఇంకా నీట్‌గా మార్చేలా ఈ అప్‌డేట్స్ ఉన్నాయి. మ్యూజిక్ షేరింగ్, మెసేజ్ ట్రాన్స్‌లేషన్, మెసేజ్‌లు షెడ్యూల్ చేయడం, ఇంపార్టెంట్ చాట్‌లు పిన్ చేయడం వంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
* చాట్ వదలకుండానే మ్యూజిక్ షేర్
ఇకపై మీరు యాప్ మారకుండానే డైరెక్ట్‌గా డీఎమ్‌లలో మ్యూజిక్ షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు పాటలో 30-సెకన్ల ప్రివ్యూను పంపించవచ్చు. దీంతో మ్యూజిక్ రెకమెండేషన్స్ మరింత ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. అంతేకాదు, మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పడుతుంది. పాట ఎలా షేర్ చేయాలంటే DM చాట్ ఓపెన్ చేసి, స్టిక్కర్ ట్రేను ట్యాప్ చేయాలి.

"మ్యూజిక్" సెలెక్ట్ చేసి, మీకు కావాల్సిన పాట కోసం సెర్చ్ చేయాలి. పాటను ఎంచుకోగానే, 30-సెకన్ల ప్రివ్యూ సెండ్ అవుతుంది. ప్రివ్యూ స్పిన్నింగ్ వినైల్ స్టిక్కర్‌లా కనిపిస్తుంది. రిసీవర్ చాట్‌లోనే ఆ స్నిప్పెట్‌ను ప్లే, పాజ్, ఫాస్ట్-ఫార్వర్డ్ లేదా రీవైండ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్‌లలో కూడా పనిచేస్తుంది.
* క్విక్ యాక్సెస్ కోసం ఇంపార్టెంట్ మెసేజ్‌లు పిన్
చాట్‌లు లెంగ్తీగా ఉండి ఇంపార్టెంట్ మెసేజ్‌లు మిస్ అవుతున్నారా? ఇకపై ఇన్‌స్టాగ్రామ్ ఒక్కో చాట్‌కు మూడు మెసేజ్‌ల వరకు పిన్ చేసుకునే ఆప్షన్ ఇస్తోంది. దీంతో మీకు కావాల్సిన మెసేజ్‌లు ఈజీగా కనిపిస్తాయి. మెసేజ్ ఎలా పిన్ చేయాలంటే, మెసేజ్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. "పిన్" ట్యాప్ చేస్తే అది టాప్‌లో పిన్ అవుతుంది.
పిన్ చేసిన మెసేజ్‌లలో టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, GIFలు, స్టిక్కర్లు, లింక్‌లు, రీల్స్, మ్యూజిక్ లేదా ఆడియో ఫైల్స్ ఏదైనా ఉండొచ్చు. లిమిట్ దాటిన తర్వాత కొత్త మెసేజ్ పిన్ చేస్తే, పాత పిన్ చేసిన మెసేజ్ రీప్లేస్ అవుతుంది.
* ఇన్‌స్టంట్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్
వేర్వేరు భాషల్లో కమ్యూనికేట్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ. ఇన్‌స్టాగ్రామ్ 99 భాషల్లో ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. మెసేజ్ ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలంటే మెసేజ్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. "ట్రాన్స్‌లేట్" ట్యాప్ చేస్తే, ట్రాన్స్‌లేట్ చేసిన టెక్స్ట్ ఒరిజినల్ టెక్స్ట్ కింద కనిపిస్తుంది.
ఇంటర్నేషనల్ చాట్స్‌లో, ట్రావెలింగ్‌లో లేదా గ్లోబల్ కస్టమర్స్‌తో డీల్ చేసే బిజినెస్‌లకు ఇది చాలా యూజ్‌ఫుల్. అయితే మెటా ట్రాన్స్‌లేషన్ సర్వీస్‌ను ఇంప్రూవ్ చేయడానికి ట్రాన్స్‌లేట్ చేసిన మెసేజ్‌లను కలెక్ట్ చేస్తుంది. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను మరింత ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది.
* మెసేజ్‌లు షెడ్యూల్
ఇప్పుడు మీరు మెసేజ్‌లను స్పెసిఫిక్ డేట్, టైమ్‌కి షెడ్యూల్ చేయొచ్చు. రిమైండర్స్ పెట్టుకోవడానికి, వర్క్ మెసేజ్‌ల కోసం లేదా వేర్వేరు టైమ్ జోన్స్‌లో ఉన్న వాళ్లతో మాట్లాడటానికి ఇది పర్‌ఫెక్ట్. మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలంటే మీ మెసేజ్ టైప్ చేయాలి. సెండ్ బటన్‌ను షెడ్యూల్ మెనూ వచ్చే వరకు హోల్డ్ చేయాలి.
డేట్, టైమ్ సెలెక్ట్ చేసి, సెండ్‌పై నొక్కాలి. షెడ్యూల్ చేసిన మెసేజ్ డెలివర్ అయ్యే వరకు మీకు మాత్రమే కనిపిస్తుంది. మీ షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు చాట్ కింద "షెడ్యూల్డ్ మెసేజ్" దగ్గర ఉంటాయి. ఈ ఫీచర్ చాలామందికి ఎంతో ప్రయోజనకరమైనది అని చెప్పుకోవచ్చు.
* QR కోడ్స్‌తో గ్రూప్ చాట్స్‌కు పీపుల్‌ను ఇన్వైట్ చేయొచ్చు
గ్రూప్ చాట్స్‌కు పీపుల్‌ను యాడ్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ. ఒక్కొక్కరినీ యాడ్ చేసే బదులు, యూజర్స్ QR కోడ్‌ను షేర్ చేయొచ్చు. దీంతో ఇతరులు వెంటనే గ్రూప్‌లో జాయిన్ అవ్వొచ్చు. గ్రూప్ చాట్ కోసం QR కోడ్ ఎలా జనరేట్ చేయాలంటే, గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి.
టాప్‌లో గ్రూప్ నేమ్‌ను ట్యాప్ చేయాలి. "ఇన్వైట్ లింక్" సెలెక్ట్ చేసి, తర్వాత "QR కోడ్"పై నొక్కాలి. చాట్‌లో ఎవరు జాయిన్ అవ్వాలనేది అడ్మిన్స్ ఎప్పుడైనా QR కోడ్‌ను రీఫ్రెష్ చేసి మేనేజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని చెప్పవచ్చు దీని వాడటం కూడా సింపుల్.
* యూజర్స్‌కి క్రమంగా విడుదల
ఈ ఫీచర్లు iOS, ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఒక్కొక్కరిగా అందుబాటులోకి వస్తున్నాయి. వెబ్ యూజర్స్‌కి తర్వాత వస్తాయి. మ్యూజిక్ షేరింగ్, మెసేజ్ షెడ్యూలింగ్, ట్రాన్స్‌లేషన్స్, పిన్డ్ మెసేజ్‌లతో ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్‌లను మరింత ఇంటరాక్టివ్‌గా, యూజర్-ఫ్రెండ్లీగా మారుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌ను బాగా మెరుగుపరచడానికి చాలా శ్రద్ధ పెడుతోంది.


Click it and Unblock the Notifications








