ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక కొత్త ఫీచర్!! ఓన్లీ-ఆడియో లైవ్ సెషన్లతో క్లబ్‌హౌస్‌కు పోటీ

|

సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరోక ప్రసిద్ధ యాప్ ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ప్రారంభించడంతో టిక్‌టాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌టాక్‌ ఇటీవల పూర్తిగా ఆప్ అయిన తరువాత ఈ ఫోటో-షేరింగ్ యాప్ తన లైవ్ సెషన్ల కోసం కొత్త ఫీచర్లతో క్లబ్‌హౌస్‌తో పోటీ పడటానికి ప్రయత్నిస్తోంది. క్లబ్‌హౌస్‌లో మాదిరిగానే తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో లైవ్ సంభాషణల కోసం ప్రజలు ఇప్పుడు ఓన్లీ-ఆడియో ద్వారా మాత్రమే లైవ్ ప్రసారాలను నిర్వహించగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్ లో ఓన్లీ-ఆడియో లైవ్ వీడియోలకు అనుమతి
 

ఇన్‌స్టాగ్రామ్ లో ఓన్లీ-ఆడియో లైవ్ వీడియోలకు అనుమతి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా లైవ్ ప్రసారం చేసేటప్పుడు ప్రజలు తమ యొక్క కెమెరాలను ఆపివేయడానికి వీలుగా అనుమతిని తీసుకురానున్నది. తద్వారా ఇతర వ్యక్తులతో వాయిస్ చాట్‌ల ద్వారా పలకరించడానికి వీలును కల్పిస్తుంది. ఇది పూర్తిగా క్లబ్‌హౌస్ లాంటిది కానప్పటికీ ఇది కూడా అదే తరహాలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ యాప్ ఒక విధంగా సహాయపడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ యొక్క కొత్త యాప్ తో మీరు లైవ్ సెషన్లలో మీ ఆడియోను మ్యూట్ చేయవచ్చు. ఇది కూడా క్లబ్‌హౌస్‌లో లభించే ఒక ఫీచర్ కావడం విశేషం. తద్వారా మీరు లైవ్ ప్రసారానికి సులభంగా ఎటువంటి ఆటంకం లేకుండా హాజరవుతారు. ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటంటే లైవ్ సెషన్‌ను ప్రారంభించిన వ్యక్తి యొక్క అవసరం లేకుండా వినియోగదారులు మ్యూట్ చేయవచ్చు. అయితే లైవ్ ప్రసారకులు ఇతరుల కోసం వీడియోను ఆఫ్ చేయలేరు. అయితే ఇన్‌స్టాగ్రామ్ భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలను ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌కు అదనంగా కొత్తగా లభించిన ఈ ఫీచర్ ఇటీవల ఒక వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి లైవ్ ప్రసారం చేయగల సామర్థ్యం లభించింది. ఇంటరాక్టివ్ సెషన్‌లు మరియు సహకారాల కోసం కంటెంట్ సృష్టికర్తలకు మరియు వినోదం కోసం లైవ్ ప్రసారం చేయాలనుకునే ఇన్‌స్టాగ్రామర్‌లకు కూడా ఇది సహాయపడుతుంది.

ఫేస్‌బుక్ యొక్క ఇతర ప్రయత్నాలు
 

ఫేస్‌బుక్ యొక్క ఇతర ప్రయత్నాలు

ఫేస్‌బుక్ క్రొత్త ఫీచర్ తో క్లబ్‌హౌస్ కు ప్రత్యామ్నాయాలను తీసుకురావాలనే తపనతో ఇటీవల ఒక ప్రయోగాత్మక ప్రశ్నోత్తరాల వేదిక అయిన హాట్లైన్ ను ప్రవేశపెట్టింది. ఇది పబ్లిక్ బీటా పరీక్షలో భాగంగా లభిస్తుంది. ఇది వ్యక్తులను లైవ్ ప్రసారం చేయడానికి మరియు ఇతరుల నుండి ప్రశ్నలు అడగడానికి మరియు వ్రాతపూర్వక లేదా వాయిస్ ఆధారిత సమాధానాలను అందించడానికి అనుమతిస్తుంది.

సోషల్ మీడియా

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం క్లబ్‌హౌస్‌తో పోటీ పడటానికి ఆడియో ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్‌లోని లైవ్ ఆడియో రూమ్‌లను పరీక్షించడం ప్రారంభించింది. అలాగే ప్రజలు సులభంగా ఓన్లీ-ఆడియో సంభాషణలను జరపడానికి ఫేస్‌బుక్ యొక్క కొత్త ఫీచర్ ఈ వేసవిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Instagram New Feature!! Competition For Clubhouse With Only-Audio Live Sessions

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X