ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో సూపర్ ఫీచర్.. ఎలా ఉపయోగపడుతుంది..?
మెటా నేతృత్వంలోని ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల కాలంలో కీలక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల మల్టీ ఆడియో ట్రాక్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇన్‌స్టా యూజర్లు తమ రీల్స్ లో ఒకటి కంటే ఎక్కువ ఆడియో ట్రాక్ లను యాడ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా మరో ఫీచర్ ను (Instagram Notes post) తీసుకొచ్చింది. తన నోట్స్ ఫీచర్ లో మరిన్ని మార్పులు చేస్తోంది.
ఈ నోట్ మూడు రోజులపాటు ఉంటుంది.. :
ఈ కొత్త ఇన్‌స్టా ఫీచర్ ద్వారా యూజర్లు తన యాప్ లో రీల్స్ మరియు ఫీడ్ ఫోస్ట్‌లపై నోట్స్‌ను ఫోస్ట్ చేయవచ్చు. మూడు రోజుల పాటు ఈ నోట్ ఉంటుందని తెలిపింది. మ్యూచువల్ ఫ్రెండ్స్ మాత్రమే నోట్స్ లో రీల్స్ మరియు పోస్ట్‌లను చేయగలరు. ఓ నివేదిక ఆధారంగా టీనేజీ యూజర్లు నోట్స్ ఫీచర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత చాట్‌లకు మరింత ప్రాధాన్యత :
ఈ ఫీచర్ ను తొలిసారిగా మే నెలలో టెస్టింగ్ చేశారు. అయితే ఈ నోట్స్ కొత్త అప్ డేట్ మూడు రోజులపాటు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వ్యక్తిగత చాట్ లకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ కూడా.. :
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జతచేయవచ్చని తెలుస్తోంది. ఈ ఆడియోను స్టిక్కర్, క్లిప్స్ మరియు టెక్స్ట్‌కు అనుగుణంగా ఎంచుకోవచ్చు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొస్సేరీ వెల్లడించారు. ఈ ఆడియో ట్రాక్‌లను క్రియేట్ చేసిన వారికే క్రెడిట్ ఇస్తామని వెల్లడించారు.
ఈ ఫీచర్ కోసం ఇన్‌స్టాగ్రాప్ కొత్త వెర్షన్ కు అప్‌డేట్ చేసుకోవాలి. వీడియో ఎడిటర్ ఆప్షన్ లో యూడ్ టూ మిక్స్‌లో ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవాలి. అనంతరం ఆడియోలో మీకు కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకోవాలి. చివరికి ఈ మల్టీ ట్రాక్ లైవ్‌లోకి అందుబాటులోకి వస్తుంది.
గత నెలలో :
గత నెలలో ఇన్‌స్టా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రకటనదారులకు ఇన్‌స్టాగ్రామ్ మరింత లాభదాయకంగా మార్చేందుకు యాడ్ బ్రేక్స్ పేరుతో ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా వీడియోను Skip చేసేందుకు అవకాశం లేని యాడ్‌లను వినియోగదారులకు చూపుతుంది. ఫలితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరిన్ని ఫోస్టులు చూడాలంటే కచ్చితంగా యాడ్స్‌ను పూర్తిగా చూడాల్సి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








