ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌తో మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయవచ్చు.. దీంతోపాటు న్యూ ఇయర్ కోసం కొత్తగా..!!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (instagram) ఇటీవల కాలంలో అనేక ఫీచర్‌లను విడుదల చేస్తోంది. యూజర్ల సౌకర్యం, భద్రత ఫీచర్ లను తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో టీన్ అకౌంట్స్ సహా ఇతర ఫీచర్‌లను తీసుకొచ్చిన మెటా.. తాజాగా డైరెక్ట్ మెసేజ్‌ల కోసం సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు న్యూ ఇయర్ కోసం మరిన్ని ఫీచర్‌లను తీసుకొస్తోంది. ఇటీవల లైవ్ లొకేషన్ ను షేర్ చేసే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ఈ ఫీచర్ ను కలిగి ఉంది.
కావల్సిన సమయానికి షెడ్యూల్ చేయవచ్చు :
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా డైరెక్ట్ మెసేజ్ (DM) లను యూజర్లకు నచ్చిన సమయానికి షెడ్యూల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌లో ఉన్న send బటన్‌ను లాంగ్ ప్రెస్ (Long Press) చేయడం ద్వారా మెసేజ్‌లను ఎప్పుడు పంపాలని భావిస్తున్నారో ఆ సమయానికి షెడ్యూల్ చేయవచ్చు. ప్రస్తుతానికి మెసేజ్‌ను గరిష్ఠంగా 29 రోజుల వరకు షెడ్యూల్ చేసేందుకు అవకాశం ఉంది.

మార్పులు చేయవచ్చు :
ప్రస్తుతానికి ఈ డైరెక్ట్ మెసేజ్‌ను (instagram DM) షెడ్యూల్ చేసే ఆప్షన్ ప్రస్తుతానికి టెక్ట్స్ మెసేజ్‌లకే అందుబాటులో ఉందని తెలుస్తోంది. అయితే షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు చాట్‌లో కనిపించనున్నాయి. అయితే వీటిపై క్లిక్ చేసి షెడ్యూల్ చేసిన సమయాల్లో మార్పులు చేయవచ్చు. లేదా పూర్తిగా డిలీట్ చేయవచ్చు. లేదా వెంటనే మెసేజ్ చేయవచ్చు.
ఫేవరెట్ స్టోరీని క్రియేట్ చేయవచ్చు :
ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్ యాప్‌లో న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ఫీచర్‌లను తీసుకొస్తోంది. 2024 సంవత్సరంలో ఫేవరెట్ మొమెంట్స్‌తో ప్రత్యేకంగా స్టోరీని క్రియేట్ అవకాశం ఉంటుంది. జనవరి తొలివారం వరకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. గతంలో మాన్యువల్‌గా ఈ తరహా స్టోరీని క్రియేట్ చేసుకోవాల్సి ఉండేది.
ప్రత్యేక టెంప్లేట్ ;
దీంతోపాటు హాలీడే సీజన్ సందర్భంగా ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొస్తోంది. Add Yours పేరుతో తీసుకొస్తున్న టెంప్లేట్‌ను స్టోరీకి యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టోరీకి న్యూ ఇయర్, కౌంట్‌డౌన్ వంటి పదాలను కూడా జతచేయవచ్చని తెలుస్తోంది. హాలీడే చాట్ థీమ్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. కొన్నిరోజులపాటు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల టీన్ అకౌంట్స్‌ను మెటా తీసుకొచ్చింది. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారికి ఈ అకౌంట్స్‌ను కేటాయిస్తారు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల్లో సెప్టెంబర్ నుంచే ఈ తరహా అకౌంట్‌లను కేటాయించడం ప్రారంభించింది. భారత్‌లో 2025 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ సాధారణ అకౌంట్ లు వినియోగిస్తున్న చిన్నారుల ఖాతాలను టీన్ అకౌంట్ లుగా మార్చనున్నారు. ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ పేరెంటర్ కంట్రోల్స్ తోపాటు బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటాయి. ఇవి డిఫాల్ట్‌గానే ప్రైవేట్ మోడ్‌లో ఉంటాయని మెటా చెబుతోంది. ఫాలో అవుతున్న వ్యక్తులు మాత్రమే నేరుగా మెసేజ్‌లు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








