హ్యాష్‌ట్యాగ్స్‌తో మరింత ట్రెండీగా ఇన్‌స్టాగ్రామ్‌

By: BOMMU SIVANJANEYULU

తమ యూజర్లను మరింతగా యంగేజ్ చేయించే క్రమంలో ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు హ్యాష్‌ట్యాగ్‌లను అనుసరిస్తూ ఫోటోస్, వీడియోస్, ఫ్రెండ్స్ అలానే తమకు నచ్చిన హాబీలను డిస్కవర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

హ్యాష్‌ట్యాగ్స్‌తో మరింత ట్రెండీగా ఇన్‌స్టాగ్రామ్‌

కొద్ది రోజుల క్రితం వరకు టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్‌గా అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. #onthetable, #slime #floralnails వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఇన్‌స్టాగ్రామ్‌‌లో విస్తృతంగా వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తమ యూజర్లు హ్యాష్‌ట్యాగ్‌ ఫీచర్‌ను ఫాలో అవటం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు మరింత శోధించదగినవిగా మారిపోతాయని సంస్థ వెల్లడించింది.

ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే..?

ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను ఫోలో అవటం అంటే వ్యక్తిని ఫాలో అవ్వటమే. ఈ హ్యాష్‌ట్యాగ్ ఆప్షన్ ద్వారా నచ్చిన టాపిక్‌లను సెర్చ్ చేసుకునే వీలుంటుంది. హ్యాష్‌ట్యాగ్ పేజీని ఓపెన్ చేసి మీకు నచ్చిన హ్యాష్‌ట్యాగ్‌కు సంబంధించి ఫాలోయింగ్ బటన్ పై క్లిక్ చేేసినట్లయితే, ఆ హ్యాష్‌ట్యాగ్‌‌తో రిలేట్ అయి ఉన్న టాప్ పోస్ట్స్ అలానే లేటస్ట్ స్టోరీస్ మీకు కనిపిస్తాయి.

ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్‌ఫాలో చేసుకునే వీలుంటుంది. ఇతర వ్యక్తులు అనుసరిస్తోన్న హ్యాష్‌‌ట్యాగ్‌లను కూడా మీరు తెలుసుకునే వీలుంటుంది. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేసుకున్న దాని పక్రారం మీ హ్యాష్‌ట్యాగ్స్ విజబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్‌ను ప్రయివేట్ మోడ్‌లోకి సెట్ చేసినట్లయితే మీ హ్యాష్‌ట్యాగ్స్ మీ ఫాలోవర్స్‌‍కు మాత్రమే విజిబుల్ అవుతాయి.

రష్యా పంజా విప్పితే, భయంతో విలవిలలాడిపోతున్న బ్రిటన్ !

Read more about:
English summary
The ability to follow hashtags will be really helpful for Instagram users to keep up with topics they are interested in.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot