ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ‘రీమిక్స్’

Posted By: BOMMU SIVANJANEYULU

ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ వర్షన్‌ నెంబర్ 24కు అప్‌గ్రేడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. తాజా అప్‌డేట్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్‌ను ఉద్దేశించి అనేక కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ యాడ్ చేసింది. వాటిలో 'రీమిక్స్’ ఫీచర్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ‘రీమిక్స్’

ఇన్‌స్టాగ్రామ్‌లోని డైరెక్ట్ మెసేజ్ ఫీచర్ ద్వారా మీ మిత్రుడు మీకో ఫోటోను షేర్ చేసినట్లయితే, అదే ఫోటోకు మీరు రీమిక్స్ సదుపాయం ద్వారా స్టిక్కర్ లేదా టెక్స్ట్‌ను యాడ్ చేసి రిప్లై చేసే వీలుంటుంది. ఫోటోకు రిమిక్స్ ఇవ్వటం ద్వారా అది మరింత క్రియేటివ్‌గా, ఫన్నీగా కనిపిస్తుంది. ఈ ఫన్ ట్రిక్ ఫీచర్ అందరికి ఉపయోగం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రీమిక్స్ ఫీచర్‌తో పాటు మరికొన్ని సదుపాయాలను ఇన్‌స్టాగ్రామ్ తన లేటెస్ట్ వర్షన్‌లో యాడ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీరు పంపే ఫోటోను రిసిప్టెంట్ ఎన్నిసార్లు చూడాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.

వన్ వ్యూ ఆప్షన్‌ను సెల్ట్ చేసుకోవటం ద్వారా ఒకసారి మాతమ్రే మీరు పంపిన ఫోటోను రిసిప్టెంట్ ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు. రీప్లే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అనేక సార్లు మీరు పంపిన ఫోటోను రిసిప్టెంట్ వీక్షించగలుగుతారు.

మెసెంజర్‌లోకి మరో క్రేజీ ఫీచర్..!

ఇన్‌స్టాగ్రామ్ 24 వర్షన్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ను విజిట్ చేయటం ద్వారా ఈ కొత్త అప్‌డేట్‌ను పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ ఇన్‌స్టెంట్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త కెవిన్ సిస్ట్రోమ్ 2010లో ప్రారంబించారు.

2012లో 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని రకాల యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. అనేక కంపెనీలు తమ పాపులారిటీని పెంచుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ఫాలో అవుతున్నాయి.

English summary
Instagram Android app has received a new update that brings in two new features including remix that let you edit photos received via direct messages.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot