థర్డ్‌పార్టీ యాప్‌ల అవసరం లేకుండా ఇన్‌స్టా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి కీలక ప్రకటన చేశారు. ఎటువంటి థర్డ్‌పార్టీ యాప్‌లను వినియోగించకుండా ఇన్‌స్టా పబ్లిక్ అకౌంట్ల రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు పబ్లిక్ అకౌంట్ల నుంచి షేర్ అయిన స్టోరీ, రీల్స్‌ను సేవ్ చేసుకొనే అవకాశం ఉండేది. ఆ వీడియోలన్నీ రీల్ ట‌్యాబ్‌లో కనిపించేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో వినియోగదారులు రీల్స్‌ను తమ ఫోన్‌కు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు ఇతర సోషల్ మీడియాల్లో షేర్ చేసుకోవచ్చు.

అయితే ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించుకోవాలో ఆడమ్ మోస్సేరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. వినియోగదారులు తన ఇన్‌స్టా ఖాతాల ఓపెన్ చేసి, షేర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలని తెలిపారు. అక్కడ కనిపించిన డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే పబ్లిక్ అకౌంట్ల నుంచి షేర్ అయిన్ రీల్స్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేయగలరని చెప్పారు.
ఇన్‌స్టా ప్రైవేటు ఖాతాల నుంచి షేర్ అయిన రీల్స్‌ను ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు డౌన్‌లోడ్ చేయలేరని తెలిపారు. అయితే పబ్లిక్ అకౌంట్ల కలిగిన వినియోగదారులు తాము షేర్ చేసిన రీల్స్‌ను ఎవరూ డౌన్‌లోడ్ చేయకుండా నియంత్రించవచ్చని ఆడమ్ మోస్సేరీ తెలిపారు.
ఆడమ్ మోస్సేరీ తన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ద్వారా వివరాలను షేర్ చేశారు. ఈ ఫీచర్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన రీల్‌కు ఇన్‌స్టాగ్రామ్ లోగో తోపాటు ఎవరి ఖాతా నుంచి రీల్ డౌన్‌లోడ్ చేశారో వారి పేరు కనిపిస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న సమాచారం లేదు.
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వాటర్‌మార్క్ లేకుండానే డ్రాఫ్ట్‌ల నుంచి వారి సొంత రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు ఆ రీల్స్‌ను వారు ఇన్‌స్టా స్టోరీలు పెట్టుకోవచ్చు లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల్లోనూ షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టా రీల్స్‌ను కెమెరా రోల్‌లో సేవ్ చేయడం వల్ల లింక్ కాపీ చేయాల్సిన అవసరం లేకుండా ఇతర సోషల్ మీడియా యాప్‌లో షేర్ చేయవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్ ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. వినియోగదారులు తమ సమస్యలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందో ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications