Instagram Map Feature : భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్.. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ ను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే భారత్ యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ ఓ మంచి ఫీచర్‌ను లాంచ్ చేసింది. మ్యాప్ ఫీచర్ (Instagram Map Feature) పేరుతో తీసుకొచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్ ఆగస్టులోనే అందుబాటులోకి వచ్చింది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్ అనేక ప్రత్యేక ప్రైవసీ ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ఈ మ్యాప్ ఫీచర్ ప్రత్యేకత ఏంటి, యూజర్లకు ఎలా పనికొస్తుంది. అయితే ఈ ఫీచర్ వల్ల ఏమైనా ప్రైవసీ ఇబ్బందులు ఉన్నాయా?

మ్యాప్ ఫీచర్ :
ఇన్‌స్టాగ్రామ్ భారత్ తాజాగా పరిచయం చేసిన మ్యాప్ ఫీచర్ ద్వారా మీ చివరి యాక్టివ్ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. అయితే ఎంచుకున్న యూజర్లతో మాత్రమే షేర్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీ ఫ్రెండ్స్, ఇతర క్రియేటర్లు పోస్టుల లొకేషన్‌ను తెలుసుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
దీంతోపాటు నిర్దిష్టమైన ప్రదేశాలకు ట్యాగ్ చేసిన పోస్ట్‌లను కూడా ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. కేఫ్‌లు, ఫ్రెండ్స్ వెళ్లే ప్రాంతాలు, ట్రెండింగ్ లొకేషన్‌లను గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్, iOS లకు అందుబాటులోకి వస్తుంది. అయితే భారత్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్రైవసీ ఫీచర్‌లతో విడుదల చేశారు.
ఇంకో మంచి విషయం ఏంటంటే :
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ లొకేషన్ షేర్ చేయబడుతుందో తెలుసుకొనేందుకు మ్యాప్ పైభాగంలో సింబల్ ఉంటుంది. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే.. మీ లొకేషన్ ఆటోమేటిక్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది. మీకు కావాల్సిన సమయాల్లోనే మాన్యువల్‌గా మీరు ఆన్ లేదా ఆఫ్ చేసుకొవచ్చు.
మీరు ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే మీ లొకేషన్ తెలిసేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో లొకేషన్ షేరింగ్‌ను బ్లాక్ లేదా ఆఫ్ చేయవచ్చు. టీనేజ్ అకౌంట్లలో లొకేషన్ షేరింగ్ ఆన్ చేయాలంటే, వారి తల్లిదండ్రుల అనుమతితోనే చేయాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఏదైనా ఫోటో, వీడియో, రీల్ పోస్ట్ చేస్తున్న సమయంలో మ్యాప్ కూడా జతచేసి ఉందో లేదో కూడా మీరు తెలుస్తుంది. పోస్ట్ చేసే ముందు ప్రివ్యూ రూపంలో కనిపిస్తుంది. ఫలితంగా మీ లొకేషన్ షేరింగ్ పై మీరు ఓ స్పష్టత వస్తుంది. మ్యాప్ ఫీచర్ అవసరం లేదని భావిస్తే వెంటనే ఆఫ్ చేయవచ్చు.
* రియల్‌టైం లొకేషన్ షేరింగ్ కారణంగా కొన్నిసార్లు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి పోస్ట్‌కు మ్యాప్‌ను జతచేస్తుంటే, లేదా ఎల్లప్పుడూ లొకేషన్ ఆన్‌లోనే ఉంటుంటే ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశం
* ఎల్లప్పుడూ లొకేషన్ ఆన్‌లోనే ఉండడం లేదా అన్ని ఫోటోలు, వీడియోలు, రీల్స్‌కు ఎక్కువగా మ్యాప్‌ను జతచేయడం కారణంగా మీ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ లొకేషన్ డేటాను మెటా ఉపయోగించుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








