పాపులర్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరింత అప్ డేట్ అయ్యింది. తన యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు రెండు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.
అవే స్టోరీస్ ఆర్కైవ్, స్టోరీస్ హైలెట్లు. ఈ రెండు కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వారి స్టోరీలను సేవ్ చేసుకోవడానికి అనుమతించే ఫ్లాట్ ఫాంలో భాగంగా ఉంటాయి. అంతేకాదు యూజర్లు వారి ప్రొఫైల్లను సూచించడానికి మరో ఫ్లాట్ ఫాంను కూడా అందిస్తారు.
స్టోరీస్ ఆర్కైవ్ ఫీచర్ ద్వారా, మీ స్టోరీలను యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రొఫైల్ కు యాడ్ చేసే స్టోరీలు, ప్రైవేట్ ఆర్కైవ్లో ఆటోమెటిక్ గా సేవ్ చేయబడుతాయి. తర్వాత మీరు దాన్ని సూచించవచ్చు. ఆర్కైవ్ నుంచి స్టోరీస్ను...ఇప్పటికే ఉన్న స్టోరీకి కూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు స్టోరీలను హైలైట్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇక మీకు స్టోరీస్ ఆర్కైవ్ ఫీచర్ అంటే ఇంట్రెస్ట్ లేనట్లయితే...దాన్ని టర్న్ ఆఫ్ కూడా చేయవచ్చు.
ఇక స్టోరీస్ హైలైట్స్ అని పిలిచే కొత్త ఫీచర్ విషయానికి వస్తే...మీ ప్రొఫైల్లో కొత్త స్పేస్ ను సూచిస్తుంది. ఇక్కడ మీరు ఇప్పటికే చర్చించిన స్టోరీస్ ఆర్కైవ్ నుంచి సోర్స్ ఇమేజ్ లను పొందే అవకాశం ఉంటుంది. భద్రపరిచిన ఇమేజ్ లు కొత్త ట్యాబ్లో మీ ప్రొఫైల్లో కనిపిస్తాయి. మీరు ఆర్కైవ్ నుంచి కావల్సినన్నీ హైలైట్లను యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫోటోగ్రిడ్ పై హరిజాంటల్ స్క్రోల్ బార్ కూడా చూడవచ్చు.
దేశంలో డేటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోతాయి !
ఆర్కైవ్లో స్టోరీలను యాక్సెస్ చేయడానికి, మీరు మీ ప్రొఫైల్లో కనిపించే ఆర్కైవ్ ఐకాన్ను నొక్కాలి. మీరు పోస్టులో ఆర్కైవ్ మరియు స్టోరీస్ ఆర్కైవ్ ల మధ్య ఈజీగా మారవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆర్కైవ్ ద్వారా నావిగేట్ చేయడానికి ప్రతిరోజు మీ స్టోరీలో తేదీని సూచిస్తుంది.
ఈ కొత్త ఫీచర్స్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటిలోనూ ఇన్ స్టాగ్రామ్ 25వ వెర్షన్ లో కనిపిస్తాయి. ముఖ్యంగా స్నాప్ చాట్ ఫీచర్ ప్రజాదరణ పొందిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు ప్రారంభం అయ్యాయి. స్నాప్ చాట్ ఇంతకుముందు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది... ఇప్పు స్టోరీస్ ఆర్కైవ్ ఇన్ స్టాగ్రామ్లో ప్రవేశపెట్టారు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.