ఆ స్టోరీలను వాట్సాప్ స్టోరీలుగా పెట్టుకోవచ్చట!

Posted By: Madhavi Lagishetty

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. యూజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను వాట్సాప్ స్టేటస్ గా మార్చుకునేందుకు ఫేస్ బుక్ ఈ కొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది. మీరు ఇన్ స్టాగ్రామ్ యూజర్ అయినట్లయితే...ఇన్ స్టా స్టోరీలను ఫేస్ బుక్ స్టోరీలుగా షేర్ చేసుకునే అవకాశం గురించి తెలిసే ఉంటుంది.

ఆ స్టోరీలను వాట్సాప్ స్టోరీలుగా పెట్టుకోవచ్చట!

త్వరలోనే వాట్సాప్ స్టేటస్ గానూ ఇన్ స్టా స్టోరీలను పెట్టుకునేలా యూజర్లకు ఛాన్స్ ఉంటుంది. అయితే స్టేటస్ బార్ లోకి స్టోరీ వచ్చిన 24గంటల తర్వాత మనకు కనపడదు. ఈ ఫీచర్ పై ప్రస్తుతం ఫేస్ బుక్ పనిచేస్తుందని...సెలక్ట్ చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ను ఫేస్ బుక్ అధికారింగా లాంచ్ చేయబోతోంది.

టెక్ క్రంచ్ రిపోర్టు ప్రకారం , కంపెనీ ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ రూపంలో ...నేరుగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్ మరియు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ రెండూ కూడా స్నాప్ చాట్ ఫీచర్ తో ప్రేరణ పొందినట్లు చెప్పవచ్చు.

వినియోగదారులు ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలు మరియు గిఫ్ లను షేర్ చేస్తుంది. ఈ స్టేటస్ లు ఆటోమెటిక్ గ్గా 24గంటల తర్వాత స్నాప్ చాట్లోనే అద్రుశ్యమవుతాయి. ఒక స్టేటస్ గా వాట్సాప్ లో పోస్టు చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ కూడా మెసేజ్ యాప్ యొక్క మిగిలిన భాగంలోకి కూడా ఎన్ర్కిప్టెడ్ చేయబడుతుందని రిపోర్టు పేర్కొంది.

ఈ నివేదికకు సంబంధించిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ...ఇన్ స్టాగ్రామ్ లో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు యూజర్లకు వారితో ఉన్న వ్యక్తుల్లో ఏ సమయంలోనైనా షేర్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. అంతేకాదు యూజర్లకు సులభంగా ఉండే నూతన మార్గాల్ని ఎల్లప్పుడూ టెస్టు చేస్తున్నట్లు పేర్కొంది.

అదిరే ఫీచర్లతో రూ. 7 వేలకు లభించే బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి

వాట్సాప్ లో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను పోస్టు చేయగల కెపాసిటిని పరిమిత సంఖ్యలో వినియోగదారుల్లో పరీక్షించడం జరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్ షేరింగ్ స్ర్కీన్ నుంచి వాట్సాప్ స్టోరీస్ షేరింగ్ కోసం ఒక ఆప్షన్ను పొందుతారు. దీంతో వారు వాట్సాప్ స్టేటస్ తీసుకుంటారు. ఓవర్, సెండ్ వాట్సాప్ స్టోరీ పంపించు అనే హిట్ అవసరం ఉంటుంది.

బ్రెజిల్లో టెక్నో బ్లాగ్ అని పిలిచే ఒక లోకల్ బ్లాగుచే...గతలో అనేకసార్లు ఇలాంటి వీక్షణలను పోస్ట్ చేసినట్లు తెలిపింది. ఎడమవైపున ఇన్ స్టాగ్రామ్ స్టోరీ మరియు కుడివైపున ఉన్న వాట్సాప్ స్టేటస్ ను పిక్ఛర్ పోస్ట్ చేసింది. ముఖ్యంగా షేరింగ్ వాట్సాప్ స్టేటస్ దిగువ కుడి కార్నర్ లో ఒక ఇన్ స్టాగ్రామ్ ఐకాన్ కనిపిస్తుంది.

వాట్సాప్ వంటి ఇతర ఫ్లాట్ ఫాంలో ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ షేరింగ్ చేయదగినదిగా ఫేసుబుక్ సెలక్ట్ చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. మొదటిది మరింత ఫంక్షనాలిటీ యాడ్ చేసి, ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ను మరింత ప్రజాదరణ పొందేలా చేయవచ్చు.

ఫేస్ బుక్ ప్రకారం, ఇన్ స్టాగ్రామ్ స్టోరీలకు , వాట్సాప్ స్టేటస్ లకు రోజుకు 300 మిలియన్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ఫేస్ బుక్ చూస్తోంది. వాట్సాప్ లో యూజర్లు ఫేర్ చేసుకునే విధంగా కంపెనీ అనుమతిస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందడానికి కారణం కూడా ఇదే. మొత్తంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ షేరింగ్ మరియు వాట్సాప్ స్టేటస్ ను ఉపయోగించడానికి ఫేస్ బుక్ యూజర్ కార్యకలాపాలను పెంచడానికి అనుమతిస్తుంది.

English summary
Facebook appears to be looking forward to introduce an option that will let users to share their Instagram Stories on WhatsApp and use the same as WhatsApp Status. A recent media report claims that this feature is under testing and it could be an attempt by Facebook to hike the engagement of users and overall traffic.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot