భారత్‌లోనూ Instagram Teen accounts ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!
సోషల్ మీడియా వినియోగం ప్రస్తుతం అధికమవుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా వినియోగిస్తున్నారు. కంటెంట్‌పై సరైన నియంత్రణ లేకపోవడం సహా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన్నారులపై సోషల్ మీడియా చెడు ప్రభావం చూపుతోంది. దీనిపై చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.
టీన్ అకౌంట్స్ :
చిన్నారుల కోసం ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్ (instagram teen accounts feature) తీసుకొచ్చింది. గత సంవత్సరం చివర్లో అమెరికా, యూకే వంటి దేశాల్లో టీన్స్ అకౌంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లోనూ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుందని ఇన్‌స్టా తెలిపింది.

తల్లిదండ్రులు పర్యవేక్షణ :
టీన్ అకౌంట్స్ ను ప్రత్యేకంగా 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన యూజర్లకు కేటాయిస్తారు. అయితే ఈ అకౌంట్స్‌లు చాలా సురక్షితంగా ఉంటాయని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. ఇన్‌స్టా టీన్ అకౌంట్స్‌లో సెన్సిటివ్ కంటెంట్‌పై పూర్తి నియంత్రణ ఉంటుంది. మరియు చిన్నారుల అకౌంట్‌లను వారి తల్లిదండ్రులు పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపింది.
బిల్ట్ ఇన్ సేఫ్టీ ఫీచర్‌లు :
ఈ టీన్ అకౌంట్స్ బిల్ట్ ఇన్ సేఫ్టీ ఫీచర్‌లను కలిగి ఉంటాయని చెబుతోంది. ఈ అకౌంట్‌లు డిఫాల్ట్‌గా ప్రైవేటు గా ఉండనున్నాయి. కేవలం ఫాలో, కనెక్ట్ చేసిన యూజర్లు మాత్రమే టీన్ అకౌంట్స్‌ను మెసేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సెన్సిటివ్ కంటెంట్, ఇతర సెట్టింగ్స్‌లో మార్పులు చేసేందుకు తల్లిదండ్రుల అనుమతి కావాల్సి ఉంటుంది.
ఫాలో, కనెక్ట్ కావాల్సిందే :
ఈ ఇన్‌స్టా టీన్ అకౌంట్స్‌ను ఇతరులు ఎవరైనా ఫాలో కావాలంటే.. ఆ అకౌంట్ యూజర్లు కచ్చితంగా అనుమతించాల్సి ఉంటుంది. ఫాలో, కనెక్ట్ కాకుండా DM (డైరెక్ట్ మెసేజ్) చేసేందుకు కూడా అవకాశం ఉండదు. ఫలితంగా ఇతరులు ప్రభావితం చేసే అవకాశం ఉండదు.
చెడు ప్రభావం లేకుండా :
తల్లిదండ్రులు వారి చిన్నారుల అకౌంట్స్‌ను తనిఖీ చేసేందుకు వీలుంటుంది. ఫీడ్, మెసేజ్‌లను పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు టీన్ అకౌంట్స్‌ను వినియోగించకుండా నియంత్రించే అధికారం కూడా ఉంటుంది. ఫలితంగా చిన్నారులపై చెడు ప్రభావం లేకుండా జాగ్రత్త వహించవచ్చు.
దీంతోపాటు ఈ అకౌంట్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేక దృషిసారిస్తుంది. ఫలితంగా ఎలాంటి బ్యాడ్ లేదా సెన్సిటివ్ కంటెంట్ వారికి కనిపించే అవకాశం ఉండదు. వీటితోపాటు కామెంట్స్‌లో అసభ్య పదాలను ఆటోమేటిక్‌గా ఫిల్టర్ కానున్నాయి. ఫలితంగా ఇతరులు ప్రభావితం చేసే అవకాశం ఉండదు.
రోజులో 60 నిమిషాల వరకే :
ముఖ్యంగా రోజులో ఎక్కువ సమయం ఇన్‌స్టా వినియోగించకుండా టీన్ అకౌంట్స్‌ను నియంత్రించవచ్చు. రోజులో 60 నిమిషాల వినియోగం అనంతరం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రూపంలో అలెర్ట్ వస్తుంది. దీంతోపాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడల్ ఆన్ లో ఉంటుంది. ఆ సమయంలో ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా.. ఇన్‌స్టా నోటిఫికేషన్లపై నియంత్రణ ఉంటుంది.
ఎవరెవరితో కనెక్ట్ అయ్యారో :
ముఖ్యంగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మరింత ఎక్కువ నియంత్రణ ఉండనుంది. దీంతోపాటు గడిచిన వారం రోజుల్లో చిన్నారులు ఎవరెవరితో కనెక్ట్ అయ్యారో వారి వివరాలు చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే వారి మెసెజ్‌లు చూసేందుకు అవకాశం ఉండదు.
చిన్నారులు రోజులో ఎంత సమయం ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించాలో కూడా తల్లిదండ్రులు డిసైట్ చేయవచ్చు. దానికి అనుగుణంగా టైం లిమిట్ పెట్టేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు కొన్ని ప్రత్యేక సమయాల్లో చిన్నారులు తమ ఇన్‌స్టా ఖాతాలను చూసేందుకు వీలులేకుండా నియంత్రించవచ్చు. యూజర్లు తమ వయసుకు సంబంధించి తప్పుడు వివరాలు నమోదు చేయకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా తెలిపింది.


Click it and Unblock the Notifications








