యాప్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలిస్తే షాకే!

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ముందుగా చేసే పని యాప్స్ డౌన్ లోడ్ చేయడం. ప్రస్తుతం దేశంలో యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ముందుగా చేసే పని యాప్స్ డౌన్ లోడ్ చేయడం. ప్రస్తుతం దేశంలో యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అన్ని పనులకు యాప్స్ నే ఉపయోగించడంతో వీటి డిమాండ్ బాగా పెరిగిపోయింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి ఇంటర్నెట్‌ యాప్స్‌ రూ.1.4 లక్షల కోట్లను అందించినట్టు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

1,000 mbps స్పీడ్‌తో BSNL ఆల్ట్రా ఫాస్ట్1,000 mbps స్పీడ్‌తో BSNL ఆల్ట్రా ఫాస్ట్

2020 నాటికి

2020 నాటికి

2020 నాటికి ఈ మొత్తం మరింత పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయన రిపోర్టు పేర్కొంది.

 

 

అధ్యయన రిపోర్టును

అధ్యయన రిపోర్టును

ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌, బ్రాండ్‌బ్యాండు ఇండియా ఫోరం చేపట్టిన అధ్యయన రిపోర్టును కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా శుక్రవారం విడుదల చేశారు.

వాయిస్‌ కంటే డేటా ఎక్కువగా

వాయిస్‌ కంటే డేటా ఎక్కువగా

వాయిస్‌ కంటే డేటా ఎక్కువగా ఇండస్ట్రీని రన్‌ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజా సంప్రదింపుల మేరకు ప్రస్తుత టెలికాం పాలసీని కూడా తాము పునఃపరిశీలిస్తున్నామని సిన్హా చెప్పారు.

యాప్స్‌ వల్ల

యాప్స్‌ వల్ల

యాప్స్‌ వల్ల మనదేశ ఆర్థికవ్యవస్థకు కనీసం సగానికి పైగా సహకారం ఇంటర్నెట్‌ ద్వారానే అందుతున్నట్టు అధ్యయన రిపోర్టు తెలిపింది.

270.9 బిలియన్‌ డాలర్లు యాప్స్‌ ద్వారానే

270.9 బిలియన్‌ డాలర్లు యాప్స్‌ ద్వారానే

2020 నాటికి భారత జీడీపీకి ఇంటర్నెట్‌ ఎకానమీ 537.4 బిలియన్‌ డాలర్ల సహకారం అందిస్తుందని ఈ స్టడీ అంచనావేస్తోంది. వీటిలో కనీసం 270.9 బిలియన్‌ డాలర్లు యాప్స్‌ ద్వారానే వస్తాయని చెప్పింది.

సిస్కో అంచనాల ప్రకారం

సిస్కో అంచనాల ప్రకారం

ఐటీ కంపెనీ సిస్కో అంచనావేసిన వర్చ్యువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌ ఆధారితంగా ఇంటర్నెట్‌ వాడకాన్ని అధ్యయనం చేశారు. సిస్కో అంచనాల ప్రకారం 2015లో మొత్తం ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో భారత ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ నాన్‌-పీసీ డివైజ్‌లో 28 శాతముంది.

Best Mobiles in India

English summary
Internet apps added Rs1.4 lakh crore to India's GDP in 2015-16 : study Read more at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X