ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్, గూగుల్ కొత్త జీమెయిల్ ఫీచర్ లాంచ్ చేసింది

యాపిల్ ఐఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న యునిఫైడ్ ఇన్‌బాక్స్ ఫీచర్‌ను, గూగుల్ ఎట్టకేలకు తన జీమెయిల్ ఐఓఎస్ (Gmail iOS ) యాప్‌లో లోడ్ చేసింది.

|

యాపిల్ ఐఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న యునిఫైడ్ ఇన్‌బాక్స్ ఫీచర్‌ను, గూగుల్ ఎట్టకేలకు తన జీమెయిల్ ఐఓఎస్ (Gmail iOS ) యాప్‌లో లోడ్ చేసింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ జీమెయిల్ యాప్‌లో లభ్యమవుతోంది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఐఫోన్ యూజర్లు తమ జీమెయిల్ ఐఓఎస్ యాప్‌లో మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్‌లను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

జియో GigaFiberతో పెను సంచలనాలేజియో GigaFiberతో పెను సంచలనాలే

మెయిల్స్ అన్నీ సింగిల్ లిస్టులో కనిపిస్తాయి...

మెయిల్స్ అన్నీ సింగిల్ లిస్టులో కనిపిస్తాయి...

ఈ ఫీచర్ లాంచ్ చేయక ముందు ఒకటి లేదా రెండు జీమెయిల్ అకంట్లను మాత్రమే ఐఫోన్ యూజర్లు వినియోగించు కోగలిగేవారు. తాజాగా యాడ్ అయిన ఫీచర్ ద్వారా తమ అన్ని జీమెయిల్ అకౌంట్లకు సంబంధించిన అన్ని ఇన్‌బాక్సులను యాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లోని డ్రాయర్ నుంచి చూసుకోవచ్చు. వాటిని సెలక్ట్ చేసుకున్నట్లయితే అన్ని అకౌంట్లకు సంబంధించిన మెయిల్స్ సింగిల్ లిస్టులో కనిపిస్తాయి. ఈ కొత్త ఫీచర్ మరో 15 రోజులలో అఫీషియల్‌గా రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.

 

 

మరో ఆసక్తికర ఫీచర్..

మరో ఆసక్తికర ఫీచర్..

గూగుల్ తన జీమెయిల్ సర్వీసును ఉద్దేశించి పలు ఆసక్తికర ఫీచర్లను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం జీమెయిల్ సర్వీస్ కోసం మరో ఆసక్తికర ఫీచర్‌ను గూగుల్ సిద్ధం చేస్తోందట. ఆ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.

 

 

షెడ్యూలింగ్ మరింత సలువు..

షెడ్యూలింగ్ మరింత సలువు..

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఫీచర్ ద్వారా జీమెయిల్ యూజర్లు తమ ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. జీమెయిల్ v8.7.15 ఏపీకే సోర్స్ కోడ్‌లో ఈ ఫీచర్‌ను గూగుల్ పొందుపరిచినట్లు సదరు సైట పేర్కొంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు జీమెయిల్ యాప్ ద్వారా ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది.

2004 నుంచి కొత్త ఫీచర్లు యాడ్ అవుతూనే ఉన్నాయి..

2004 నుంచి కొత్త ఫీచర్లు యాడ్ అవుతూనే ఉన్నాయి..

ఇప్పటికే కొన్ని పద్థతుల్లో ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకోగలుగుతున్నప్పటికి భవిష్యత్‌లో మరింత సులువుగా వీటిని షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. "schedule send" పేరుతో ఈ డీఫాల్ట్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని ఆండ్రాయిడ్ పోలీస్ చెబుతోంది. గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో ఒకటైన జీమెయిల్ 2004 నుంచి కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.

Best Mobiles in India

English summary
iPhone users, Google is 'changing' your mailbox.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X