IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేస్తోంది, టికెట్ బుకింగ్ మరింత ఈజీ..

|

టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసి ప్రయాణికులకు మరింత చేరువయ్యే క్రమంలో ఇండియన్ రైల్వేస్ తన అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఆండ్రాయిడ్ వర్షన్ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మొబైల్ యాప్‌ను మరింతగా అప్‌డేట్ చేయబోతోంది.

IRCTC to launch a new website and mobile app to make booking faster and simpler

త్వరలో అందుబాటలోకి రానున్న కొత్త వెబ్‌సైట్‌తో టికెట్ బుకింగ్ ప్రాసెసింగ్ మరింత సులువుగా ఉంటుందని ఇండియన్ రైల్వేస్ చెబుతోంది. ప్యాసెజంర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయబడిన ఈ సైట్‌లో టికెట్‌ను బుక్ చేసుకునే సమయంలో Timed Out అవుతుందన్న ఇబ్బందే ఉండదని రైల్వే శాఖ వెల్లిండించింది.

ఆధునిక సదుపాయాలతో అప్‌డేట్ కాబడుతోన్న తన వెబ్‌సైట్ అలానే మొబైల్ యాప్ ద్వారా పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని రాబట్టాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. కన్ఫర్మ్ కాబడిన టికెట్లను డిస్‌ప్లే చేయటం, ప్రయాణాలను ప్లాన్ చేసుకునేందుకు డేటా అనలిటిక్స్ ఆధారంగా డేట్స్ సజెస్ట్ చేయటం వంటి సరికొత్త ఫీచర్లను ఇండియన్ రైల్వేస్ తీసుకురాబోతోంది.

టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !

రైళ్లు రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైమ్ బేసిస్‌లో ప్రయాణికులకు తెలియజేసేందుకుగాను అవసరమైన ఎస్ఎంఎస్ అలర్ట్స్ మెకనిజాన్ని కూడా ఇండియన్ రైల్వేస్ ప్రారంభించబోతోంది. రైలు ఆలస్యానికి గల కారణాలు, తరువాతి స్టేషన్‌కు అది ఎంతసేపటిలో చేరుకుంటుంది వంటి వివరాలను టెక్స్ట్ మెసేజ్ రూపంలో జర్నీలో ఉన్న ప్రయాణికులకు రైల్వేస్ పంపనుంది.

కొత్త యాడ్ చసిన కొన్ని ఫీచర్లకు సంబంధించి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహాయాన్ని తీసుకున్నట్లు రైల్వేస్ శాఖ తెలిపింది. ప్యాసెంజర్లు ప్రయాణించాల్సిన ట్రెయిన్‌లకు సంబంధించి ఖచ్చితమైన లొకేషన్ వివరాలను ఇస్రో తన శాటిలైట్స్ ద్వారా తెలియజేస్తుందని ఐఆర్‌సీటీసీ అఫీషియల్ ఒకరు తెలిపారు.

రైల్వే టికెట్‌లను ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఒక్కటే మార్గం. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ అంటే కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సింపుల్ టిప్స్‌ను ఫాలో అవటం ద్వారా మీ ప్రయాణాన్ని మరింత సలుభతరం చేసుకోవచ్చు..

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా స్టేషన్ కోడ్స్, షెడ్యూల్స్ ఇంకా రూట్లకు సంబంధించి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. Magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో తత్కాల్ టికెట్ లను వేగవంతంగా బుక్ చేసుకోవచ్చు.

మీరు బుక్ చేసకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే ఆ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ధర విమాన ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ సేవలను అందిస్తోంది.

railyatri.in అనే లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా మీరు ఎక్కాల్సిన ట్రెయిన్‌ను రియల్ టైమ్ అనుభూతులతో ట్రాక్ చేయవచ్చు. Travel Khana వెబ్‌సైట్, ప్రయాణంలో మీకు కావల్సిన ఆహారాన్ని సరఫరా చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
The railway is now reportedly launching a revamped website and a new Android-based IRCTC mobile app to ensure faster and easier ticket-booking.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X