ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే యాప్.. మీ డేటా ఎక్కడా స్టోర్ చేయరు, ఫోన్ నంబర్ కూడా అడగరు!
ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే (jack Dorsey) బిట్‌చాట్ మెష్ యాప్ (Bitchat Mesh) ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. పూర్తిగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ప్రస్తుతం యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్ ను ఉపయోగించుకుంటుంది. మరియు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను కలిగి ఉంటుంది.
ఎటువంటి వివరాలు అవసరం లేకుండానే :
ఈ బిట్‌చాట్ యాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం ఈ యాప్ నాయిస్ ప్రోటోకాల్ ఫ్రేమ్‌వర్క్ ను ఉపయోగిస్తుంది. ఈ యాప్ మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు తీసుకోదు. దీంతోపాటు మీ చాటింగ్ అంటా లోకల్‌గానే స్టోర్ చేస్తుందని మరియు కొద్ది కాలంలోనే వాటిని డిలీట్ చేస్తుంది.

బ్యాకప్ లేకుండానే :
ఈ యాప్‌లో చాటింగ్ ఎక్కడా బ్యాకప్ ఉండదని చెబుతోంది. మరియు మీకు సంబంధించిన డేటా అంతా మీ ఫోన్‌లోనే ఉంటుందని, ఫలితంగా గోప్యతకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర సమయాల్లో ఈ యాప్ అనుకూలంగా ఉంటుందని చెబుతోంది.
సింపుల్, క్లీన్ ఇంటర్‌ఫేస్ :
ఈ యాప్‌లో మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. మరియు మీ మెసేజ్‌లను ఎవరూ చూసేందుకు అవకాశం ఉండదు. దీంతోపాటు ఈ యాప్ ఇంటర్‌ఫేస్ క్లీన్ మరియు సింపుల్ గా ఉంటుంది. గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ యాప్ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ యాప్ లో యూజర్లు ఫేవరెట్స్ ను మార్కింగ్ చేసుకోవచ్చు. మరియు అవసరం లేని కాంటాక్ట్ ను బ్లాక్ చేయవచ్చు.
హెచ్చరిక :
జాక్ డోర్సే ఈ యాప్‌ను ఓపెన్ సోర్స్ గ్రూప్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. ఐఫోన్ నుంచి విజన్ ప్రో వరకు అనేక ఆపిల్ డివైజ్‌లకు సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ యాప్‌ను ఇతర భద్రతా నిపుణులు పరీక్షించలేదని వినియోగదారులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ప్రైవేట్ సహా ఇతర సున్నితమైన చాట్‌ల కోసం ఉపయోగించకూడదు. సరైన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చే వరకు ప్రైవేట్ చాట్ కోసం ఉపయోగించకుండా ఉండాలని సూచిస్తోంది.

ప్రస్తుతానికి ఆపిల్ యూజర్లకు మాత్రమే :
ఈ యాప్ ప్రస్తుతానికి iOS 16 సహా ఇతర కొత్త వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది. అదే విధంగా ఆండ్రాయిడ్ 8.0 సహా తర్వాత వెర్షన్‌లను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే ఆండ్రాయిడ్ యూజర్ లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది కనుక భారీ వర్షాలు, వరదలు సహా ఇతర అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయాలు ఉంటాయి. దీంతోపాటు టెలిఫోన్ నెట్ వర్క్ కూడా దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ యాప్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








