Home
Apps

జియో నుంచి కొత్త యాప్‌ విడుదల అయింది... UPI, రీఛార్జ్‌ల నుంచి లోన్స్‌ వరకు ఎన్నో ప్రయోజనాలు.. !!

జియో నుంచి ఇవాళ మరో కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. జియో ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ రూపొందించిన ఈ జియో ఫైనాన్స్ యాప్‌ (Jio Finance App) ఇవాళ పూర్తిస్ధాయిలో విడుదల అయింది. ఈ యాప్‌ మే నెలలో బీటా వెర్షన్‌గా లాంచ్‌ అయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆపిల్‌ ఫోన్‌ యూజర్లు ఆపిల్‌ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మై జియో యాప్‌లోనూ ఈ ఫైనాన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయని జియో వెల్లడించింది.

ప్రతి లావాదేవీపైన రివార్డ్‌లు!
ఈ జియో ఫైనాన్స్‌ యాప్‌ ద్వారా UPI, డిజిటల్‌ బ్యాంకింగ్, పేమెంట్లు, మొబైల్‌ రీఛార్జ్‌, FASTag, DTH రీఛార్జ్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా చేయవచ్చు. ఈ యాప్‌ ద్వారా చేసే ప్రతి రీఛార్జ్‌ పైన రివార్డులు అందిస్తామని జియో తెలిపింది. ఈ యాప్‌లో మీ బ్యాంకు ఖాతాలను సులభంగా లింక్‌ చేసుకోవచ్చు.

Jio Finance app launched in india

5 నిమిషాల్లో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్ :
ఈ యాప్‌ బ్యాంకింగ్‌ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుందని జియో వెల్లడించింది. ఈ యాప్‌ ద్వారా కేవలం 3 steps లోనే జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియ అంతా 5 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ అకౌంట్‌ ద్వారా IMPS లేదా NEFT ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించవచ్చని తెలిపింది.

లోన్‌లు కూడా తీసుకోవచ్చు :
ఈ యాప్‌లోని లోన్ ఆన్‌ చాట్‌ (Loan On Chat) ఫీచర్‌ ద్వారా రుణాలు పొందవచ్చు. దీంతోపాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ పైన లోన్‌లు పొందవచ్చు. పూర్తి రుణం మొత్తానికి ఒకేసారి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఉద్యోగాలు, MSME వారికి లోన్‌ సదుపాయం ఉంది. ఈ జియో ఫైనాన్స్‌ యాప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌లను వీక్షించే అవకాశం కూడా ఉంది.

ఈ జియో ఫైనాన్స్‌ యాప్‌ ద్వారా బీమా సదుపాయాన్ని కూడా పొందవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమాలను అందిస్తుంది. జియో యాప్‌ సమాచారం ఆధారంగా ప్రస్తుతం UPI ప్లాట్‌ఫాంలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ యాప్‌ ద్వారా చేసే రీఛార్జ్‌లపై ఎటువంటి ఫీజు ఉండదని తెలుస్తోంది. దీంతోపాటు ఈ జియో ఫైనాన్స్‌ యాప్‌ను ఏ సిమ్‌ కార్డుతోనైనా వినియోగించుకోవచ్చు.

ఇప్పటికే జియో అనేక యాప్‌లను అందిస్తోంది. జియోటీవీ, జియోసినిమా, జియో క్లౌడ్‌ యాప్‌లు ఉన్నాయి. తాజాగా జియో ఫైనాన్స్‌ సర్వీసెస్‌ యాప్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్‌ ద్వారా, ఆపిల్ ఫోన్‌ యూజర్లు ఆపిల్ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Finance app launched in india with UPI payments recharges and loan features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X