జియో ఫోన్‌లకు గూగుల్ మ్యాప్స్ సపోర్ట్

By GizBot Bureau
|

ఇండియన్ మార్కెట్లో పెను సంచలనం రేపిన జియో ఫోన్‌కు సంబంధించి సక్సెసర్ వెర్షన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకురాబోతోంది. జియో ఫోన్ 2 పేరుతో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. మొదటి వెర్షన్ మాదిరిగానే ఈ వెర్షన్ కూడా KaiOS ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను మరింతగా అప్‌డేట్ చేయటంతో వాట్సాప్, యూట్యూబ్ వంటి ఫీచర్లు జియో ఫోన్ 2లో అదనంగా జతకాబోతున్నాయి. 2018, ఆగష్టు 15 నుంచి జియో ఫోన్ 2 మార్కెట్లో లభ్యమవుతుంది.

 

KaiOS ప్రాజెక్టులో రూ.151 కోట్ల పెట్టుబడి..

KaiOS ప్రాజెక్టులో రూ.151 కోట్ల పెట్టుబడి..

ఫీచర్ ఫోన్‌లలో తన యాప్ సూట్‌ను ప్రవేశపెట్టే లక్ష్యంతో గూగుల్, KaiOS ప్రాజెక్టులో రూ.151 కోట్ల వరకు పెట్టుబడులుగా పెట్టింది. KaiOSకు సంబంధించి తాజాగా లాంచ్ చేసిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్‌ను జియో ఫోన్ సపోర్ట్ చేస్తోంది.

జియో స్టోర్ యాప్‌‌లోకి వెళ్లినట్లయితే...

జియో స్టోర్ యాప్‌‌లోకి వెళ్లినట్లయితే...

ఈ సర్వీసును పొందాలనుకునే జియో ఫోన్ యూజర్లు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పై క్లిక్ చేయటం ద్వారా 2018.628.2 వెర్షన్‌తో కూడిన అప్‌డేట్ వీరికి లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిన తరువాత జియో స్టోర్ యాప్‌‌లోకి వెళ్లినట్లయితే గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ వీరికి కనిపిస్తుంది.

మినిమల్ లేఅవుట్‌తో కనిపిస్తుంది..
 

మినిమల్ లేఅవుట్‌తో కనిపిస్తుంది..

దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్ యాక్టివేట్ అవుతుంది. 2.4 అంగుళాల QVGA ప్యానల్‌ను కలిగి ఉండే జియో ఫోన్‌లలో గూగుల్ మ్యాప్స్ మినిమల్ లేఅవుట్‌తో కనిపిస్తుంది. KaiOS కోసం గూగుల్ అభివృద్ది చేసిన గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ సాంప్రదాయ గూగుల్ మ్యాప్స్ యాప్‌తో పోలిస్తే తక్కువ ఫైల్ సైజును కలిగి ఉంటుంది.

ప్రపంచ మ్యాప్‌ను కూడా యాక్సిస్ చేసుకోవచ్చు

ప్రపంచ మ్యాప్‌ను కూడా యాక్సిస్ చేసుకోవచ్చు

జియో ఫోన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ద్వారా సెర్చ్, మ్యాపింగ్, లొకేషన్, డ్రైవ్, టూ-వీలర్, ట్రెయిన్ లేదా బస్, వాక్, మ్యాప్ లేయర్స్ తదితర సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా నేవిగేషన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. ప్రపంచ మ్యాప్‌ను కూడా స్ర్కీన్ పై యాక్సిస్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో KaiOS నుంచి లాంచ్ అయిన మరో అప్‌డేట్‌లో భాగంగా ఫేస్‌బుక్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్...

జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్...

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, అప్‌డేటెడ్ KaiOS సాఫ్ట్‌వేర్, 52 ఎంబి ర్యామ్, 4జీబి ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, జీపీఎస్, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో.

Best Mobiles in India

Read more about:
English summary
As part of a new software update, Google Maps is now available on the Jio Phone. The availability of the Jio Phone software update (2018.628.2) can be checked by going into Settings > Device > Software update and installing it.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X