జియో చాట్‌లో నైపుణ్య ఆధారిత విద్య

Posted By: BOMMU SIVANJANEYULU

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో నైపుణ్యత అనే చాలా ముఖ్యమైన అంశం. స్కిల్ అనేది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతాం. నైపుణ్య ఆధారిత విద్య (స్కిల్ బేసిడ్ ఎడ్యుకేషన్)కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ అండ్ సర్టిఫికేషన్స్ సంస్థ మిలియన్‌లైట్స్, జియో చాట్‌లో సరికొత్త ఛానల్‌ను లాంచ్ చేసింది.

జియో చాట్‌లో నైపుణ్య ఆధారిత విద్య

ఈ ఛానల్ ద్వారా జియో చాట్ సర్వీసును ఉపయోగించుకుంటోన్న యూజర్లు తమ నైపుణ్యాలను బట్టి కోర్సులను ఎంపిక చేసుకుని వాటి పై మరింత పట్టు సాధించే వీలుంుటంది. స్కిల్ ఆధారిత్ కంటెంట్‌ను నేర్చుకోవాలనుకునే వారికి ఇదో చక్కటి అవకాశం. మాఈ చొరవ లక్షలాది మంది జీవితాలను శక్తివంతం చేస్తుందని కృత నిశ్చయంతో ఉన్నట్లు మిలియన్‌లైట్స్ సీఈఓ అక్షత్ శ్రీవాస్తవ తెలిపారు.

మిలియన్‌లైట్స్ ఛానల్ ద్వారా జియో చాట్ యూజర్లు వివిధ రేంజ్‌లలో స్కిల్ బేసిడ్ కోర్సులను నేర్చుకునే వీలుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ కెరీర్ అవకాశాలకు సంబంధించిన సందేహాలను ఇన్‌స్టెంట్‌గా తీర్చుకోవచ్చు.

ఐఫోన్ ఎస్ఈ 2పై గురిపెట్టిన ఆపిల్, అంతా సీక్రెట్ !

డిజిటల్ ఇండియా స్పూర్తితో ప్రారంభించబడిన ఈ ఛానల్ ద్వారా రానున్న 5 సంవత్సరాల్లో 5 కోట్ల మందికి నైపుణ్య ఆధారిత విద్యను అందించాలన్నది తమ లక్ష్యమని మిలియన్‌లైట్స్ సంస్థ చెబుతోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింత మందికి రీచ్ అయ్యే క్రమంలో జియో చాట్‌తో పాటుగా Yupp టీవీతోనూ మిలియన్‌లైట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. డెన్ మనోరంజన్ శాటిలైట్ భాగస్వామ్యంతో మిలియన్‌లైట్స్ ఇప్పటికే ఓ టీవీ ఛానల్ ను రన్ చేస్తోంది. ML టీవీ పేరుతో ఈ టీవీ ఛానల్ రన్ అవుతోంది.

English summary
Similar to its collaboration with JioChat, Millionlights have also collaborated with YuppTV, an OTT provider, to foster open source education.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot