jiocoin యాప్స్ అవాస్తవం, వాటిని నమ్మి మోసపోకండి

|

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న జియోకాయిన్ (JioCoin)కు యాప్‌లకు సంబంధించి రిలయన్స్ జియో అధికారికంగా స్పందించింది. ఇప్పటివరకు తాము అటువంటి యాప్‌లను మార్కెట్లో లాంచ్ చేయలేదని, జియోకాయిన్ పేరుతో ప్లే స్టోర్‌లో లిస్ట్ అయి ఉన్న యాప్స్ పూర్తిగా ఫేక్ అని జియో హెచ్చరించింది. ఇటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యూజర్లు తమ డబ్బును నష్టపోవటం తప్ప మరొకటి ఉండదని జియో తెలిపింది.

నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్స్..

నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్స్..

బిట్‌కాయిన్‌లకు అంతకంతకు డిమాండ్ ఊపందుకుంటోన్న నేపథ్యంలో ‘జియోకాయిన్' పేరిట ఓ క్రిప్టోకరెన్సీ యాప్‌ను రిలయన్స్ జియో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న పలువురు జియోకాయిన్ పేరుతో నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్‌లను సృష్టించి గూగుల్ ప్లే స్టోర్‌లో లాంచ్ చేసేసారు. ఈ నకిలీ యాప్‌ల ఉచ్చులో ఇప్పటికే చాలా మంది యూజర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

10,000 నుంచి 50,000 వరకు డౌన్‌లోడ్స్‌..

10,000 నుంచి 50,000 వరకు డౌన్‌లోడ్స్‌..

ఎకనామిక్ టైమ్స్ పోస్ట్ చేసిన ఓ కథనం ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో జియోకాయిన్ పేరుతో 22 వరకు నకిలీ యాప్స్ హల్‌చల్ చేస్తన్నాయి. వీటిలో కొన్ని యాప్స్ 10,000 నుంచి 50,000 వరకు డౌన్‌లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ యాప్స్‌కు 4 స్టార్స్ నుంచి 5 స్టార్స్ వరకు యూజర్ రేటింగ్ ఉండటం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో మరింత అప్రమత్తమైన రిలయన్స్ జియో తన అఫీషియల్ స్టేట్‌మెంట్స్ ద్వారా యూజర్లను మరింత జాగృతపరిచే ప్రయత్నం చేస్తోంది.

రూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండిరూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండి

వెంటనే డిలీట్ చేసేయండి..

వెంటనే డిలీట్ చేసేయండి..

కాబట్టి, మీరు కూడా జియో‌కాయిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యోచనలో ఉన్నట్లయితే వెంటన్నే అటువంటి ఆలోచనను విరమించుకోండి. ఒకవేళ ఇప్పటికే మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే డిలీట్ చేసేయండి.

రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్

రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న ఓ నకిలీ జియోకాయిన్ వెబ్‌సైట్ రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ అనే యూఆర్‌ఎల్‌తో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మాదిరిగేనే ఈ వెబ్‌సైట్‌ దర్శనమిస్తోంది. ఈ యాప్‌లో ఒక్కో జియో కాయిన్‌ను రూ.100కే లాంచ్‌ చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌తో రిజిస్టర్‌ అవ్వాలంటూ ఈ వెబ్‌సైట్‌ యూజర్లను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది.

Best Mobiles in India

English summary
Reliance Jio on Wednesday said that the company has not launched any cryptocurrency app called JioCoin, and the ones listed on the Play store are fake.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X