Home
Apps

జియో అదిరిపోయే ఆఫర్, 90 రోజుల పాటు ఉచిత మ్యూజిక్

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు మరో బంపరాఫర్ ని అందించింది. 90 రోజుల పాటు ఉచిత మ్యూజిక్ అందించేందుకు రెడీ అయింది.

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు మరో బంపరాఫర్ ని అందించింది. 90 రోజుల పాటు ఉచిత మ్యూజిక్ అందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే ప్రముఖ మ్యూజిక్‌ యాప్‌ సావన్‌ ​ మీడియాని రిలయన్స్ సొంతం చేసుకుంది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద ప్రసార, వినోద, కళాకారుల వేదిక సావన్‌ మీడియా ఇకపై జియోసావన్‌గా తన సేవలను అందించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం జియో సావన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లపై లభిస్తుందనీ, జియో యాప్‌స్టోర్‌, జియోఫోన్‌, జియో, జియో సావన్‌ సహా ఇతర యాప్‌స్టోర్లలో అందుబాటులోకి వచ్చిందని రిలయన్స్ జియో తెలిపింది.

కొత్త హంగులతో జియో సావన్

కొత్త హంగులతో జియో సావన్

కాగా కొత్తగా అవతరించిన రిలయన్స్ జియో మ్యూజిక్ యాప్‌ జియో సావన్‌లో డార్క్ మోడ్, జియో ట్యూన్స్ సెట్టింగ్స్ లాంటి మరిన్ని హంగులను కొత్తగా చేర్చింది.

45 మిలియన్లకు పైగా పాటలు

45 మిలియన్లకు పైగా పాటలు

ఈ యాప్‌లో జియో కస్టమర్లకు ప్రస్తుతం 45 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి. ఈ పాటలతో పాటు సావన్ ఒరిజినల్ ఆడియో షోలు, పర్సనలైజ్డ్ మ్యూజిక్ రికమెండేషన్స్ వంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను జియో సావన్ యాప్‌లో అందిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో ఎక్స్‌క్లూజివ్‌ వీడియో కంటెంట్‌ను కూడా అందించేందుకు జియో సిద్ధమవుతోంది.

90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

జియో యూజర్లు జియో సావన్ యాప్‌లో 90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని జియో తెలిపింది. అందులో యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. అలాగే 320 కేబీపీఎస్ బిట్‌రేట్‌తో హై క్వాలిటీ ఆడియో లభిస్తుంది. 3 నెలల తరువాత సాధారణ సబ్‌స్క్రిప్షన్‌కు యూజర్లు మారుతారు.

నెలకు రూ.99 ప్లాన్

నెలకు రూ.99 ప్లాన్

అయితే జియో సావన్ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌లో కొనసాగాలంటే పీరియడ్ ముగిశాక నెలకు రూ.99 చెల్లించాలి. 3 నెలలకైతే రూ.285, 6 నెలలకు రూ.550 చెల్లించాలి. పేటీఎం వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ మొత్తాన్ని గూగుల్ ప్లే ద్వారా చెల్లించాలి. దీంతో జియో సావన్ ప్రొ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.

సావన్‌ మ్యూజిక్‌ను రిలయన్స్‌ సొంతం

సావన్‌ మ్యూజిక్‌ను రిలయన్స్‌ సొంతం

2018లో మార్చిలో సావన్‌ మ్యూజిక్‌ను రిలయన్స్‌ సొంతం చేసుకుంది. భారతదేశంలో మ్యూజిక్‌ స్ట్రీమింగ్ పరిశ్రమలో ఇదొక టర్నింగ్‌ పాయింట్‌ అని జియో డైరెక్టర్‌ ఆకాష్ అంబానీ వ్యాఖ్యానించారు. సావన్ సహ వ్యవస్థాపకులు రిషి మల్హోత్ర, పరమదీప్ సింగ్, వినోద్ భట్‌ విలీన సంస్థలో కొనసాగుతారు.

 

 

200 మంది ఉద్యోగుల బృందం

200 మంది ఉద్యోగుల బృందం

అలాగే అమెరికాలోని మౌంటెన్ వ్యూ , న్యూయార్క్, బెంగళూరు, గురుగ్రాం, ముంబైల ఐదు కార్యాలయాల్లోని 200 మంది ఉద్యోగుల బృందం కూడా యథావిధిగా కొనసాగుతారని సావన్ సహ వ్యవస్థాపకులు తెలిపారు.

Best Mobiles in India

English summary
JioMusic, Saavn announce 90-days free 'premium' service for Jio users on the new app more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X