621 లైవ్ ఛానల్స్‌తో జియో టీవీ యాప్ సంచలనం
దేశీయ టెలికాం మార్కెట్లోకి 2 సంవత్సరాల క్రితం సునామి ఎంట్రీ ఇచ్చని జియో టెల్కోలకు ముచ్చెమటలు పట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. జియో ధాటికి టెల్కోలు కోట్ల నష్టాలను చవిచూశాయి.
దేశీయ టెలికాం మార్కెట్లోకి 2 సంవత్సరాల క్రితం సునామి ఎంట్రీ ఇచ్చని జియో టెల్కోలకు ముచ్చెమటలు పట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. జియో ధాటికి టెల్కోలు కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇవే కాకుండా మళ్లీ జియో యాప్స్ తో మరో సంచలనం సృష్టించింది. జియో యాప్ ద్వారా టీవీ ప్రసారాలను ఉచితంగా వీక్షించే సౌలభ్యాన్ని కల్పించింది. అలాగే సినిమాలు, లైవ్ షోలు ఇంకా ఎన్నో ప్రయోజనాలను యాప్ ద్వారా జియో అందిస్తోంది. జియో దెబ్బకు Airtel tv, వొడాఫోన్ టీవీలు కూడా తమ సబ్ స్క్రైబర్లను కాపాడుకోవడానికి ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురయింది. ఇప్పుడు జియో టీవి తమ ఫ్లాట్ ఫాం మీద 61 ఛానల్స్ ని అందించేందుకు రెడీ అయింది. ఈ ఛానల్స్ డీటీహెచ్, కేబుల్ ఫ్లాట్ ఫాం మీద అందిస్తున్న వాటికన్నా ఎక్కువ. మార్కెట్లో ఇలాంటి ఆఫర్ ని అందిస్తున్న ఏకైక ప్లాట్ ఫాం జియో ఒక్కటేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

రిలయన్స్ జియోటీవీ డౌన్లోడ్స్
జియో సబ్ స్క్రైబర్స్ కు జియో యాప్ ఉచితంగా లభిస్తోంది. Sony Pictures Networks India, Sun TV Network, and Star India వంటి వాటితో జియో పార్టనర్ గా మారి యూజర్లకు ఈ ఛానల్స్ ని యాప్ ద్వారా అందిస్తోంది. ఈ ఛానల్స్ అన్నీ జియో యాప్ ద్వారా నే వీక్షకులు వీక్షించవచ్చు.ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి దాదాపు 100 మిలియన్ల డౌన్లోడ్ మైలురాయిని చేరుకుంది.

యూజర్ల కోసం 621 ఛానల్స్
వివిధ రకాల కేటగిరీల కింద జియో టీవి యాప్ ద్వారా యూజర్లు 61 ఛానల్స్ ని వీక్షించే అవకాశాన్ని జియో టీవీ యాప్ కల్పిస్తోంది. ఇందులో 193 న్యూస్ ఛానల్స్, 122 ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్, 50 భక్తి ఛానల్స్, 49 ఎడ్యుకేషనల్ ఛానల్స్, 27 చిన్న పిల్లలకు సంబంధించిన ఛానల్స్, 35 infotainment channels, 10 lifestyle channels, 8 బిజినెస్ ఛానల్స్ ఉన్నాయి.

అన్ని రకాల భాషల్లో
ఈ ఛానల్స్ అన్నీ వివిధ రకాల భాషల్లో లభ్యమవుతున్నయి. English, Hindi, Tamil, Telugu, Kannada, Malayalam, Punjabi, Marathi, Gujarati, Bhojpuri, Urdu, Assamese, Odia, French and Bengali వంటి భాషల్లో యూజర్లు వీక్షింవవచ్చు. హెచ్ డి కంటెంట్ విషయానికి వస్తే 46 English and 32 Hindi channels అందుబాటులో ఉన్నాయి.

JioTV vs Airtel TV vs Vodafone Play
ఇప్పుడు Airtel TV కేవలం 375 ఛానల్స్ ని ఆఫర్ చేస్తోంది. అలాగే 1000 సినిమాలను పాపులర్ టీవీ షోలను ఇందులో అందిస్తున్నారు. ఈ యాప్ HOOQ, Amazon, Hotstar, SonyLIV, Eros, ALT Balaji వంటి వాటితో టై అప్ అయి వీటిని అందిస్తోంది. Airtel TV యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పుడు 50 మిలియన్ డౌన్లోడ్ మార్క్ ని చేరుకుంది.వొడాఫోన్ విషయానికొస్తే సొంత లైవ్ స్ట్రీమింగ్ కలిగి ఉంది. వొడాఫోన్ ప్లే ద్వారా 5000 సినిమాలను అన్నిభాషల్లో అందిస్తోంది. ఈ యాప్ కూడా 30 లైవ్ షోల పార్టనర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ రెండింటికీ జియో టీవీ యాప్ భారీగా పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








