Home
Apps

Koo app: ట్విట్టర్‌కు పోటీగా ప్రాంతీయ భాషల మద్దతుతో కొత్త యాప్

ప్రపంచంలోని ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం స్వావలంబన మరియు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులు మరియు సేవలపై అధిక దృష్టి పెట్టడం మరియు వాటిని ప్రోత్సహించడం మొదలుపెట్టినప్పటి నుండి భారతీయ యాప్ లు అధికంగా ఉద్భవించాయి. మరి ముఖ్యంగా చైనా యొక్క యాప్ లను నిషేధించినప్పటి నుండి అధిక సంఖ్యలో వాటికి ప్రత్యాన్మయాలు విడుదల అయ్యాయి. అటువంటి యాప్ లలో ఒకటి "కూ" యాప్. ఇది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యొక్క భారతీయ వెర్షన్ గా విడుదల అయింది. కూ యాప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కూ యాప్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

కూ యాప్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

కూ యాప్‌ను మార్చి నెలలో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా అనే వారు అభివృద్ధి చేశారు. ఇది ట్విట్టర్‌లో పోస్ట్ చేసినట్లే వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఒక వేదికగా ఉంది. ఈ యాప్ హిందీ & కన్నడ బాషలలో మొదట ప్రారంభించింది. తరువాత తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా మరియు అస్సామీ వంటి వివిధ భారతీయ భాషలలో లభిస్తుంది. ఇది వినియోగదారులు తాము ఇష్టపడే భాషలో తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది.

కూ యాప్ పోస్టులు

కూ యాప్ పోస్టులు

ఈ యాప్ వినియోగదారులను ఫాలో అవ్వడానికి మరియు ఆడియో, వీడియో, టెక్స్ట్ మరియు ఫోటోలను వివిధ ఆకృతిలో పోస్ట్‌లను షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు ఇతర వ్యక్తులతో చాట్ చేయవచ్చు మరియు పోల్స్ కూడా నిర్వహించవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో సులభంగా కూడా తెలుసుకోవచ్చు.

PM మోడీ AatmaNirbhar App ఛాలెంజ్ విన్నర్

PM మోడీ AatmaNirbhar App ఛాలెంజ్ విన్నర్

అదనంగా కూ యాప్ అనేక మంది ప్రముఖులు, న్యూస్ ఛానెల్స్, జర్నలిస్టులను అనుసరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేంద్ర ఐటి, లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ యాప్ ఇటీవల జరిగిన PM మోడీ యొక్క AatmaNirbhar App ఛాలెంజ్‌ను గెలుచుకుంది.

కూ యాప్ ను ఆండ్రాయిడ్, iOS లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కూ యాప్ ను ఆండ్రాయిడ్, iOS లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కూ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో 500,000 కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.


*** మీ యొక్క ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్ లో వరుసగా గూగుల్ ప్లే స్టోర్ లేదా App Storeని ఓపెన్ చేయండి.

*** సెర్చ్ విభాగంలో కూ యాప్ కోసం సెర్చ్ చేయండి.

*** సెర్చ్ ఫలితాల్లో యాప్ కనిపించిన తర్వాత దానిపై నొక్కండి. డౌన్‌లోడ్ పూర్తి అయిన తరువాత ఇన్‌స్టాల్ ఎంపిక మీద నొక్కండి. 

More from GizBot

Best Mobiles in India

English summary
Koo App: How to Download and Install Koo App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X