Home
Apps

ఈ న్యూస్ చదివితే ఎల్ఈడీ బల్బులు వాడటం వెంటనే ఆపేస్తారు

ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్లు, కార్యాల‌యాల్లో ఎల్ఈడీ బ‌ల్బుల‌ను వాడుతున్న విష‌యం విదిత‌మే. విద్యుత్‌ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఎల్‌ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఈ బల్బుల వ‌ల

ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్లు, కార్యాల‌యాల్లో ఎల్ఈడీ బ‌ల్బుల‌ను వాడుతున్న విష‌యం విదిత‌మే. విద్యుత్‌ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఎల్‌ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఈ బల్బుల వ‌ల్ల మ‌న కంటిలో ఉండే రెటీనా శాశ్వ‌తంగా దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంద‌ట‌. ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తేలింది.

ఈ న్యూస్ చదివితే ఎల్ఈడీ బల్బులు వాడటం వెంటనే ఆపేస్తారు

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ ఏజెన్సీ ఫ‌ర్ ఫుడ్‌, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆక్యుపేష‌న‌ల్ హెల్త్ అండ్ సేఫ్టీ (ఏఎన్ఎస్ఈఎస్‌) సంస్థ‌కు చెందిన ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఎల్ఈడీ బ‌ల్బులు కంటి చూపును దెబ్బ‌తీస్తాయ‌ని తేలింది.

ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని

ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని

సంప్ర‌దాయ సోడియం బ‌ల్బుల క‌న్నా ఈ ఎల్ఈడీ బ‌ల్బులే మ‌న ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని చేస్తున్నాయ‌ని ఈ సర్వేలో తేలింది. ఎల్ఈడీ బ‌ల్బులు ఫోటో టాక్సిక్ వ‌స్తువుల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌న కంటిలోని రెటీనా లోప‌ల ఉండే క‌ణాలు ఎల్ఈడీ బ‌ల్బుల వ‌ల్ల నాశ‌న‌మై పోతాయ‌ని, దాంతో మ‌నం కంటి చూపును కోల్పోతామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

బ్లూలైట్‌(నీలికాంతి)

బ్లూలైట్‌(నీలికాంతి)

ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూలైట్‌(నీలికాంతి) ఎక్కువస్థాయిలో ఉండటం వల్ల అది కంటిచూపును దెబ్బతీస్తుందని వెల్లడించింది. ఈ బల్బుల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. వెలుగుతున్న ఎల్‌ఈడీ బల్బులను నేరుగా చూడటం చేయకూడదని, రాత్రి నిద్రపోయే సమయంలో బల్బులను ఆఫ్‌ చేసి పడుకోవాలని పేర్కొంది. మొబైల్‌ ఫోన్స్‌, లాప్‌టాప్స్‌, ట్యాబ్లెట్లనుంచి వెలువడే నీలికాంతి కంటే ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

నేరుగా చూడ‌క‌పోతే చాలు

నేరుగా చూడ‌క‌పోతే చాలు

అయితే ఎల్ఈడీ బ‌ల్బుల‌ను నేరుగా చూడ‌క‌పోతే చాల‌ని, దాంతో కొంత వ‌ర‌కు కంటి చూపు స‌మ‌స్య రాకుండా చూసుకోవచ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక రాత్రి పూట నిద్ర‌పోయేటప్పుడు ఎల్ఈడీ బ‌ల్బుల‌ను క‌చ్చితంగా ఆఫ్ చేయాల‌ని కూడా వారు సూచిస్తున్నారు. క‌నుక‌.. మీరు కూడా మీ ఇండ్ల‌లో ఎల్ఈడీ బ‌ల్బుల‌ను వాడుతున్న‌ట్ల‌యితే జాగ్ర‌త్త‌గా ఉండండి. లేదంటే కంటి చూపు పోయేందుకు అవ‌కాశం ఉంటుంది..!

Bio-Clock

Bio-Clock

మన శరీరంలో ఉండే జీవగడియారం (Bio-Clock) కూడా ఎల్ఈడీ బల్బుల వల్ల దెబ్బతింటుందని తెలిసింది. అంటే... ప్రస్తుతం మనం రాత్రివేళ నిద్రపోతాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేస్తాం. అదే ఎల్ఈడీ బల్బుల కాంతిలో ఎక్కువ సేపు ఉండే వారిలో ఈ సిస్టం మొత్తం మారిపోతుందట. టైముకి సరిగా నిద్రపట్టదనీ, ఆకలి కూడా మందగిస్తుందనీ చెబుతున్నారు.

 వైట్ కలర్ లెడ్ లైట్లనే

వైట్ కలర్ లెడ్ లైట్లనే

ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా LED స్క్రీన్లు ఉంటున్నాయి. కాకపోతే, వీటి నుంచీ వచ్చే కాంతి తక్కువగా ఉంటుందనీ, అందువల్ల ఇవి అంతగా ప్రమాదకరం కావనీ చెబుతున్నారు. ఐతే... వీటిని కాంతి ఉన్నచోటే వాడాలనీ, చీకట్లో వాడితే కంటికి ఇబ్బందేనని సూచిస్తున్నారు. వీలైనంతవరకూ వైట్ కలర్ లెడ్ లైట్లనే వాడమని చెబుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
LED lights in your house can cause irreversible damage to the eyes and lead to a vision-robbing condition, French health authority warns
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X